ఐపీఎల్2020 .. దుబాయికి సన్ రైజర్స్, ఢిల్లీ జట్లు

By telugu news teamFirst Published Aug 24, 2020, 7:41 AM IST
Highlights

ఇద్దరు జట్లు కలిసి ఉన్న ఫోటో కూడా  వారు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ఎయిర్ పోర్టులో తీసినది కాగా.. అందులో ఢిల్లీ జట్టుకి చెందిన ఇషాంత్ శర్మ,  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి చెందిన భువనేశ్వర్ కుమార్ లు ఉన్నారు. 

ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ పూర్తిగా సిద్ధమైంది. ఇప్పటికే.. అన్ని జట్లు దుబాయి చేరుకోగా.. చిట్టచివరగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం బయలు దేరి వెళ్లింది. కాగా.. వీరితో పాటు ఢిల్లీ కాపిటల్స్ కూడా  కలిసి ప్రయాణం చేయడం గమనార్హం. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కోజట్టు.. నెమ్మదిగా యూఏఈ చేరుకుంటున్నాయి.

కాగా.. ఆదివారం సన్ రైజర్స్ జట్టు.. ముంబయి నుంచి తమ ప్రయాణం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కాగా.. అంతేకాకుండా.. తమతోపాటు ఢిల్లి కాపిటల్స్ జట్టు కూడా తమ ప్రయాణాన్ని ప్రారంభించందనే విషయాన్ని కూడా సన్ రైజర్స్ జట్టు ట్వీట్ లో పేర్కొంది. కాగా.. ఆ ట్వీట్ కి.. ఢిల్లా కాపిటల్స్ జట్టు కూడా స్పందించింది. మంచి కంపెనీ దొరికిందని రిప్లై ఇచ్చింది.

 

We got some great company on the flight, 🧡💙 https://t.co/dGl067pyH4

— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals)

ఇద్దరు జట్లు కలిసి ఉన్న ఫోటో కూడా  వారు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ఎయిర్ పోర్టులో తీసినది కాగా.. అందులో ఢిల్లీ జట్టుకి చెందిన ఇషాంత్ శర్మ,  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి చెందిన భువనేశ్వర్ కుమార్ లు ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియ్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. సెప్టెంబరు 19న ముంబయితోనే తొలి మ్యాచ్‌లో ఢీకొట్టబోతోంది. యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరుగుతుండటంతో.. గత సీజన్లతో పోలిస్తే.. అరగంట ముందే మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అంటే.. మధ్యాహ్నం మ్యాచ్‌ 4 గంటలకి బదులుగా 3.30 గంటలకి.. రాత్రి మ్యాచ్‌ 8 గంటలకి బదులుగా 7.30కి ఆరంభంకానుంది.

కాగా.. దుబాయి చేరుకున్న ఆటగాళ్లందరికీ ముందుగా కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉంది.  ఆతర్వాత ఆరు రోజుల పాటు వారిని క్వారంటైన్ లో ఉంచనున్నారు. ఈ ఆరు రోజుల్లోనే మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్టుల్లో నెగటివ్ వస్తేనే.. బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఆటగాళ్లని అనుమతిస్తారు. ఒక్కసారి ఆటగాడు ఈ బబుల్‌‌లోకి ఎంటరైతే.. టోర్నీ ముగిసే వరకూ వెలుపలికి అనుమతించరు.

click me!