ఒక వైపే చూడు: కెఎల్ రాహుల్ దూకుడు వ్యూహం ఇదే...

By telugu team  |  First Published Dec 13, 2019, 11:08 AM IST

వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాహుల్‌ ఓపెనర్‌గా సూపర్‌ సక్సెస్‌ సాధించాడు. క్లిష్టమైన 208 పరుగుల ఛేదనలో 40 బంతుల్లో 62 పరుగులు చేసిన రాహుల్‌.. వాంఖడేలో 56 బంతుల్లో 91 పరుగులతో చెలరేగాడు. హైదరాబాద్‌ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో, వాంఖడెలో 240 పరుగుల భారీ స్కోరు సాధనలో రాహుల్‌ పాత్ర కీలకం. రెండు మ్యాచుల్లోనూ తాను దూకుడుగా ఆడుతూనే, మరో ఎండ్‌లో సహచర బ్యాట్స్‌మెన్‌ కుదరుకునేందుకు స్వేచ్ఛ కల్పించాడు. 


'చూడు... బంతిని మాత్రమే చూడు... ఇక బలంగా బాదు'.. హైదరాబాద్‌లో వెస్టిండీస్‌పై 208 పరుగుల ఛేదనలో ఓపెనర్‌ కన్నూర్‌ లోకేశ్‌ రాహుల్‌ అనుసరించిన వ్యూహం ఇది. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ త్వరగా నిష్క్రమించడంతో రాహుల్ తన బాటింగ్ కి చేసుకున్న అడ్జస్ట్మెంట్ ఇది.  

క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరంభంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో రన్‌రేట్‌ ఏమాత్రం తగ్గినా, చివర్లో ఛేదన కష్టసాధ్యంగా మారుతుంది. ఆ ప్రమాదం ముంచుకురాక ముందే కెఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించాడు. 

Latest Videos

undefined

40 బంతుల్లో 62 పరుగుల ఇన్నింగ్స్‌తో ఛేదనను సులభతరం చేశాడు. ఆరంభంలో రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ సాగుతున్నంసేపు క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న విరాట్‌ కోహ్లి.. ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. 

Also read: ఔటయ్యాక.. డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి సైగలు: రోహిత్ ఎవరితో మాట్లాడుతున్నాడు..?

మరో ఎండ్‌లో రాహుల్‌ సైతం స్ట్రయిక్‌ రొటేషన్‌కు, బౌండరీల బాదుడుకు ఇబ్బంది పడితే విరాట్‌ కోహ్లి తన ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రిస్క్‌ తీసుకునేవాడు. అదే జరిగితే హైదరాబాద్‌లో టీమ్‌ ఇండియా ఛేదన కచ్చితంగా భిన్నంగా ఉండేది.

అదే ముంబైలోని వాంఖడే కు వచ్చేసరికి రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుండడంతో రాహుల్ ఒకింత క్లాసిక్ గా ఆటను ఆడాడు. అంటే మెల్లగా ఆడదాని కాదు, కానీ హైదరాబాద్ లో ప్రదర్శించినంత వేగం తొలుత చూపలేదు. 

రోహిత్ తో కలిసి అవతలి ఎండ్ లో మంచి సపోర్ట్ ఇచ్చాడు. కోహ్లీ కూడా అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడంతో రాహుల్ కూడా ఇంకా లాభం లేదని గేర్లు మార్చదు. ఇలా క్లాస్ ప్లస్ మాస్ ఆటతీరుతో రాహుల్ క్రికెట్ అభిమానుల ప్రశంసలు మాత్రమే కాదు...విమర్శకుల కితాబును సైతం అందుకున్నాడు. 

ధావన్ సర్జరీ...రాహుల్ కి అవకాశం!

కెఎల్‌ రాహుల్‌ 2010లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రాహుల్‌ సంప్రదాయ షాట్ల ఆడగలిగే క్రికెటర్‌. టెస్టు క్రికెట్‌కు సరిపోయే బ్యాటింగ్‌ శైలి, సహనం, ఏకాగ్రత రాహుల్‌లో మెండుగా కనిపించేవి. 

ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా వెళ్లే బంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ వేటాడేవాడు కాదు, వికెట్లను గిరాటేసేందుకు దూసుకొచ్చే బంతిని క్రీజులోనే నియంత్రించేవాడు. ఆ శైలి కలిగిన రాహుల్‌ 2018 ఐపీఎల్‌ సీజన్‌లో తనలోని నయా విధ్వంసకారుడిని ఆవిష్కరించేలా చేసింది. 

ఆ సీజన్‌లో 14 మ్యాచుల్లో 158.41 సగటుతో 659 పరుగులు చేశాడు. 2019 ఐపీఎల్‌ సీజన్‌లోనూ రాహుల్‌ జోరు కొనసాగింది. 14 మ్యాచుల్లో 593 పరుగులతో రాణించాడు. 2019 ఐపీఎల్‌లో రాహుల్‌ పరుగుల వేటలోనే కాదు షాట్ల ఎంపికలోనూ కొత్తదనం చూపించాడు. 

వైవిధ్యమైన స్వీప్‌లు, స్కూప్‌ షాట్లు, భారీ హిట్టింగ్‌తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మార్పు కోసం శైలి మార్చుకున్న కెఎల్‌ రాహుల్‌ ఫలితంగా టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెఎల్‌ రాహుల్‌ ఫామ్‌ విస్మరించలేని స్థాయికి చేరుకుంది. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మోకాలి గాయంతో వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ధావన్‌ జట్టులో ఉంటే కరీబియన్లతో పొట్టి పోరులో ఆడే అవకాశమే రాహుల్‌కు దక్కేది కాదు. 

దేశవాళీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో రాహుల్‌ ఫామ్‌ మెరుగ్గా ఉంది. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 52.16 సగటుతో 313 పరుగులు చేశాడు. స్పిన్‌ అనుకూలిత సూరత్‌ పిచ్‌పై 155.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు పిండుకున్నాడు.

Also read: ఘనగా ఆనమ్-అసద్ ల రిసెప్షన్... ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాహుల్‌ ఓపెనర్‌గా సూపర్‌ సక్సెస్‌ సాధించాడు. క్లిష్టమైన 208 పరుగుల ఛేదనలో 40 బంతుల్లో 62 పరుగులు చేసిన రాహుల్‌.. వాంఖడేలో 56 బంతుల్లో 91 పరుగులతో చెలరేగాడు. 

తిరువనంతపురం టీ20లో మాత్రమే కెఎల్‌ రాహుల్‌ 11 పరుగులతో నిరాశపరిచాడు. హైదరాబాద్‌ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో, వాంఖడెలో 240 పరుగుల భారీ స్కోరు సాధనలో రాహుల్‌ పాత్ర కీలకం. రెండు మ్యాచుల్లోనూ తాను దూకుడుగా ఆడుతూనే, మరో ఎండ్‌లో సహచర బ్యాట్స్‌మెన్‌ కుదరుకునేందుకు స్వేచ్ఛ కల్పించాడు. 

టి 20 ప్రపంచ కప్ టికెట్ దక్కేనా...?

2020 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఆశిస్తోన్న రాహుల్‌ ఆ దిశగా తన వైపు నుంచి పొరపాటు లేకుండా చూసుకున్నాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ ఇండియా అక్కడ కివీస్‌తో ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. 

ఆ సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సైతం అందుబాటులో ఉండనున్నాడు. న్యూజిలాండ్‌ పిచ్‌లపైనా రాహుల్‌ ఇదే స్థాయిలో మెప్పిస్తే 2020 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా విమానం టికెట్‌ దక్కించుకున్నట్టే భావించవచ్చు.

click me!