KKR vs GT: ఉతికి ఆరేసిన కేకేఆర్‌.. ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల తుఫాన్

Published : May 16, 2026, 09:47 PM IST
KKR vs GT

సారాంశం

KKR vs GT: ఐపీఎల్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దాడిని పూర్తిగా చిత్తు చేస్తూ భారీ స్కోర్ నమోదు చేశారు. 

టాస్ గెలిచినా గుజరాత్‌కు షాక్ ఇచ్చిన కేకేఆర్ ఓపెనర్లు

మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌లో తేమ ఉండటంతో ఆరంభంలో వికెట్లు తీసుకుని కోల్‌కతాపై ఒత్తిడి తీసుకురావాలని భావించింది. కానీ కేకేఆర్ ఓపెనర్లు ఆ వ్యూహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. మొదటి ఓవర్ నుంచే దూకుడు ఆట ప్రారంభించిన కోల్‌కతా బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. పవర్‌ప్లేలోనే భారీ స్కోర్ దిశగా జట్టును తీసుకెళ్లారు. గుజరాత్ బౌలర్లకు లైన్‌, లెంగ్త్ దొరకకుండా వరుసగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టించారు.

ఫిన్ అలెన్ సిక్సర్ల సునామీ

కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ప్రధాన ఆకర్షణ ఫిన్ అలెన్ ధాటైన బ్యాటింగ్. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దాడి ప్రారంభించిన అలెన్ గుజరాత్ బౌలర్లపై ఎలాంటి కనికరం చూపలేదు. కేవలం 21 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన అతను మొత్తం 34 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. 273 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన అలెన్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అర్షద్ ఖాన్, సాయి కిషోర్ వేసిన ఓవర్లలో వరుస బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను పూర్తిగా కేకేఆర్ వైపు తిప్పేశాడు. అతని దూకుడు కారణంగా కోల్‌కతా 11 ఓవర్లకే భారీ స్కోర్‌కు బలమైన పునాది వేసింది.

రఘువంశీ, గ్రీన్ మెరుపులతో స్కోర్ 247

ఫిన్ అలెన్ అవుటైన తర్వాత కూడా కోల్‌కతా బ్యాటింగ్ వేగం తగ్గలేదు. యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 44 బంతుల్లో 82 పరుగులు చేసిన రఘువంశీ 4 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు కెమెరాన్ గ్రీన్ కూడా తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన గ్రీన్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం చివరి ఓవర్లలో కేకేఆర్‌కు మరింత వేగం అందించింది.

 

 

పరుగుల వరదలో కొట్టుకుపోయిన గుజరాత్ బౌలర్లు

కేకేఆర్ బ్యాటర్ల దాడి ముందు గుజరాత్ బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. జట్టు ప్రధాన బౌలర్లు కూడా పరుగులను నియంత్రించలేకపోయారు. మహమ్మద్ సిరాజ్ తన నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని నాలుగు ఓవర్లలో కేకేఆర్ బ్యాటర్లు 57 పరుగులు రాబట్టారు. అర్షద్ ఖాన్‌, సాయి కిషోర్ వంటి బౌలర్లు కూడా ఒత్తిడిని తగ్గించలేకపోయారు. మొత్తం ఇన్నింగ్స్‌లో కేకేఆర్ బ్యాటర్లు 22 సిక్సర్లు, 12 ఫోర్లు బాదుతూ గుజరాత్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!