KKRvsDC: ‘టాప్’ లేపిన ఢిల్లీ క్యాపిటల్స్... పోరాడి ఓడిన కేకేఆర్...

By team teluguFirst Published Oct 3, 2020, 11:42 PM IST
Highlights

నితీశ్ రాణా హాఫ్ సెంచరీ...

మరోసారి నరైన్, దినేశ్ కార్తీక్ ఫ్లాప్ షో...

ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి మెరుపులు...

210 పరుగులు చేసిన కేకేఆర్... 19 పరుగుల తేడాతో ఢిల్లీకి విజయం...

IPL 2020: ఈ సీజన్‌లో మరో మ్యాచ్ ఐపీఎల్‌లోకి కిక్‌ను రుచి చూపించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం సాధించింది.. 229 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించడంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి సునామీ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ దాకా పోరాడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.. ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఘోరంగా విఫలం కాగా... శుబ్‌మన్ గిల్ 28, ఆండ్రే రస్సెల్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసిన నితీశ్ రాణా... భారీషాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ మరోసారి ఫెయిల్ కాగా... ప్యాట్ కమ్మిన్స్ 5 పరుగులు చేశాడు. 122 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కత్తాను ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి కలిసి రేసులో నిలబెట్టారు. ఇద్దరూ కలిసి సిక్సర్లతో విరుచుకుపడి ఏడో వికెట్‌కి 78 పరుగులు రాబట్టారు.

మోర్గాన్ 18 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుట్ కాగా... 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి ఆఖరి ఓవర్‌లో అవుట్ కావడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. నోకియా మూడు వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. 

click me!