RCBvsRR: ఛాలెంజర్స్ ‘రాయల్’ విక్టరీ.. రాజస్థాన్‌కి రెండో ఓటమి...

Published : Oct 03, 2020, 07:17 PM ISTUpdated : Oct 03, 2020, 07:25 PM IST
RCBvsRR: ఛాలెంజర్స్ ‘రాయల్’ విక్టరీ.. రాజస్థాన్‌కి రెండో ఓటమి...

సారాంశం

దేవ్‌దత్ రికార్డు హాఫ్ సెంచరీ... ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ... సీజన్‌లో మొదటి హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ..

IPL 2020 సీజన్‌లో మొట్టమొదటి అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... టార్గెట్‌ని ఆడుతూ పాడుతూ చేధించింది. ఆరోన్ ఫించ్ 8 పరుగులకే అవుట్ అయినా... దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేయగా... వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన విరాట్ కోహ్లీ సీజన్‌లో మొదటి అర్ధశతకం బాదాడు. రెండో వికెట్‌కి 80 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 బంతుల్లో 63 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ అవుట్ అయ్యాడు. 

పడిక్కల్ అవుటైన తర్వాత కూడా దూకుడు కొనసాగించిన విరాట్ కోహ్లీ... అద్భుత బౌండరీలతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేయగా ఏబీ డివిల్లియర్స్ 12 పరుగులు చేశాడు. 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన ఆర్‌సీబీ, టేబుల్ టాపర్‌గా నిలిచింది...

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది