KKRvsDC: ఢిల్లీ బ్యాట్స్‌మెన్ దూకుడు... కేకేఆర్ ముందు భారీ టార్గెట్...

Published : Oct 03, 2020, 09:22 PM IST
KKRvsDC: ఢిల్లీ బ్యాట్స్‌మెన్ దూకుడు... కేకేఆర్ ముందు భారీ టార్గెట్...

సారాంశం

పృథ్వీషా మెరుపు హాఫ్ సెంచరీ... శ్రేయాస్ అయ్యర్ క్లాసిక్ హాఫ్ సెంచరీ... సెంచరీ మిస్!! రిషబ్ పంత్, శిఖర్ ధావన్ మెరుపులు...

IPL 2020 సీజన్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి బ్యాటింగ్‌లో సత్తా చాటింది. షార్జా స్టేడియంలో మరోసారి సిక్సర్ల వర్షం కురిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలెట్టారు.

మొదటి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 16 బంతుల్లో 26 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసిన పృథ్వీషా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

తన స్టైల్‌కి భిన్నంగా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన శ్రేయాస్ అయ్యర్... 38 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టోయినిస్ 1 పరుగు చేయగా, హెట్మయర్ 7 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో అయ్యర్‌కి స్టైయికింగ్ రాకపోవడంతో సెంచరీ మిస్ అయ్యాడు

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !