Venkatesh Iyer: ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ప్లేయర్, ఒక్కో పరుగుకు రూ.16.73 లక్షలు

Published : Jun 03, 2025, 12:35 AM IST
Venkatesh Iyer

సారాంశం

Venkatesh Iyer: ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన కేకేఆర్ ప్లేయర్ గా ఉన్న వెంకటేశ్ అయ్యర్ పెద్దగా రాణించలేకపోయారు. ఐపీఎల్ 2025లో కేకేఆర్ కు పెద్ద భారంగా మారిన ప్లేయర్ గా కూడా నిలిచాడు.

Venkatesh Iyer: ఐపీఎల్ 2024 టైటిల్ ను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోలకతా నైట్ రైడర్స్ (KKR) విజయవంతంగా గెలుచుకున్నప్పటికీ, 2025 సీజన్ లో అలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను వదులుకుని కేకేఆర్ పెద్ద తప్పుచేసింది. 

అలాగే, మెగా వేలంలో లో కూడా ఆ జట్టు భారీగా తప్పిదాలు చేసింది. మెగా వేలంలో కేకేఆర్ భారీ పెట్టుబడి పెద్దగా లాభాన్ని అందించలేదు. టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కాదని వెంకటేశ్ అయ్యర్‌కు రూ.23.75 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే, ఐపీఎల్ 2025లో వెంకటేష్ అయ్యర్ ఆటతీరు అంచనాలను అందుకోలేకపోయింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేష్ అయ్యర్ ఏ తప్పు చేయకపోయినా, అతడి భారీ ధర అతనిపై ఒత్తిడిని పెంచింది. సీజన్ మొత్తం కలిపితే అతను 11 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. అతడి సగటు 20.28 కాగా, స్ట్రైక్‌రేట్ 139.21. 

ఈ పరుగుల్లో ఎక్కువ ఒక్క హాఫ్ సెంచరీ నుంచి వచ్చినవే. ఈ మొత్తం లెక్కల ప్రకారం కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ కు ఒక్క పరుగు కోసం రూ.16.73 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ప్రతి మ్యాచ్‌కు అతను సుమారుగా రూ.2.16 కోట్లు సంపాదించాడు.

వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకోవడానికి లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్ మెగా వేలంలో గట్టిగా బిడ్డింగ్ చేశాయి. చివరికు కేకేఆర్ అతన్ని భారీ ధరకు దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లు ఇలా చేయకపోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాయని టాక్ నడుస్తోంది.

ఈ భారీ కొనుగోలు తర్వాత కేకేఆర్ కు మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయడం కష్టమైంది. యాక్సిలరేటేడ్ ఆక్షన్ లో ప్రాథమిక ధరకు తీసుకున్న అజింక్య రహానేను చివరకు కెప్టెన్‌గా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సీజన్ చివరలో వెంకటేశ్ అయ్యర్ పూర్తిగా ఫామ్ ను కోల్పోవడంతో అతన్ని జట్టులో నుంచి తప్పించారు. అతని స్థానంలో మనీష్ పాండేని తీసుకున్నా, అది కూడా ఫలితం ఇవ్వలేదు. 

చివరికి కేకేఆర్ తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది. అయితే, ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేకేఆర్ వెంటకేష్ అయ్యర్ ను వచ్చే వేలానికి ముందు విడుదల చేసి, తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసే ఆలోచనలో ఉందా అన్నది చూడాల్సిన విషయం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !
ODI Records : ముగ్గురు మొనగాళ్లు.. వన్డే క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్‌లు ఎవరో తెలుసా?