
Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. నాన్-ఓపెనర్‌గా ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సాధించాడు. ఈ ఘనతను మే 1న నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సాధించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ ఇప్పటికే 15 ఇన్నింగ్స్‌లలో 673 పరుగులు చేశాడు. మొత్తంగా 16 మ్యాచ్ లలో 717 పరుగులు చేశాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ సగటు 65.18గా, స్ట్రైక్ రేటు 167.92గా ఉంది. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 73* పరుగులు. ఈ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు అవసరమైన సమయంలో సూర్యకుమార్ తన దూకుడు బ్యాటింగ్‌తో ఏబీ డివిలియర్స్ 2016లో చేసిన 673 పరుగుల రికార్డును అధిగమించాడు.
ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2016 సీజన్ లో 16 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఏబీడీ సగటు 52.84, స్ట్రైక్ రేట్ 168.79గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఏబీడీ నాన్ ఓపెనర్ పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
• 717 పరుగులు - సూర్యకుమార్ యాదవ్ (2025)
• 687 పరుగులు - ఏబీ డివిలియర్స్ (2016)
• 684 పరుగులు - రిషభ్ పంత్ (2018)
• 622 పరుగులు - కేన్ విలియమ్సన్ (2018)
• 605 పరుగులు - సూర్యకుమార్ యాదవ్ (2023)
గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్‌ల్లో 759 పరుగులు చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ (717 పరుగులు) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న శుభ్ మన్ గిల్ 650 పరుగులు చేశాడు. 4వ స్థానంలో ఉన్న మిచెల్ మార్ష్ 627 పరుగులు, 5వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 614 పరుగులు సాధించాడు. 6వ స్థానంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (603 పరుగులు) ఉన్నాడు.