రస్సెల్స్ విధ్వంసానికి బెంగళూరు విలవిల... కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం

By Arun Kumar PFirst Published Apr 6, 2019, 7:31 AM IST
Highlights

రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు మరో పరాజయం తప్పలేదు. సొంత మైదానం ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయాన్ని సాధించింది. భారీ స్కోరు సాధించినప్పటికి బౌలర్ల వైఫల్యంతో ఆర్సిబి ఈ ఐపిఎల్ సీజన్లో వరుసగా  మరో ఓటమిని చవిచూసింది. కోల్ కతా డాషింగ్ ప్లేయర్ రస్సెల్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తించి కేకేఆర్ ఖాతాలోకి మరో విజయాన్ని చేర్చాడు. 
 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సిబికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ (84 పరుగులు 49 బంతుల్లో), డివిలియర్స్( 63 పరుగులు 32 బంతుల్లో) విజృంభించడంతో ఈ భారీ స్కోరు సాధ్యమయ్యింది.   

206 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్ క్రిస్ లిన్(43 పరుగులు 31 బంతుల్లో), ఊతప్ప(33 పరుగులు 25 బంతుల్లో), నితీష్ రానా(37 పరుగులు 23 బంతుల్లో ) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లలో ఈ మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. 

17 ఓవర్లలో 153 పరుగుల వద్ద నిలిచిన కోల్ కతా జట్టుకు చివరి 3 ఓవర్లలో 53 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే ఆ జట్టుకు చెందిన కీలక బ్యాట్ మెన్స్ అంతా పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా బెంగళూరు బోణీ కొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్స్ ఆర్సిబి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 13 బంతుల్లోని 48 పరుగులతో నాటౌట్ గా నిలిచి అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. సౌతీ వైసిన 19 ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగిన రస్సెల్ మొత్తం 29 పరగులు పిండుకున్నాడు. ఇలా ఒక్క ఓవర్లో మ్యాచ్ గతిని మలుపుతిప్పి కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించాడు. 
 
click me!