Rohit Sharma records : వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. టీ20 క్రికెట్ లో తనకు తిరుగులేదంటూ సిక్సర్ల మోతతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
the player who has hit the most sixes : రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో ఒకే ఒక్క ప్లేయర్ గా రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. నిలకడగా ఆడుతూ భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యంతో నేటికాలం క్రికెటర్లలో అత్యంత విజయవంతమైన హిట్టర్‌లలో ఒకరిగా నిలిచాడు. ఇక టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో రవీంద్ర జడేజాను బౌలింగ్ స్వీప్ షాట్ తో భారీ సిక్సర్ బాది టీ20 క్రికెట్ లో 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ 660 మ్యాచ్‌లలో 860 సిక్సర్లు బాదాడు.
టీ20 క్రికెట్‌లో 500 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్లు వీరే..
1056 - క్రిస్ గేల్
860 - కీరన్ పొలార్డ్
678 - ఆండ్రీ రస్సెల్
548 - కోలిన్ మున్రో
500* - రోహిత్ శర్మ
కాగా, ఈ మ్యాచ్‌లో ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ ప్యాంటు జారిపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డైవింగ్ క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నంలో రోహిత్ ప్యాంటు జారిపోవడంతో ఈ సంఘటన జరిగింది. క్యాచ్‌ను పట్టుకోలేకపోవడంతో పాటు ప్యాంటు జారిపోవడంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
A 𝗛𝗜𝗧-𝗧𝗢𝗡 at the Wankhede 👊 pic.twitter.com/FG2JQjmeEE
— Mumbai Indians (@mipaltan)
అయ్యే రోహిత్ శర్మ.. క్యాచ్ పట్టబోతే ప్యాంట్ జారిపాయే.. ఏం చేసేది.. ! వీడియో