ధోని కొట్టిన ఆ హ్యాట్రిక్ సిక్సులే చెన్నైని గెలిపించాయి.. ! ముంబైని ముంచేశావ్ క‌దా హార్దిక్ !

By Mahesh Rajamoni  |  First Published Apr 15, 2024, 5:42 PM IST

MS Dhoni : ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని హ్యాట్రిక్ సిక్సుల‌తో దుమ్మురేపాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను ఉతికిపారేశాడు. దెబ్బ‌కు ముంబై కెప్టెన్ దిమ్మ‌దిరిగిపోయింది. అయితే, ధోని ఆడిన ఆ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ముంబై కొంప‌ముంచింది. 
 


MS Dhoni : ముంబ‌యి ఇండియ‌న్స్ ముంచేశాడు హార్దిక్ పాండ్యా. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో దెబ్బ‌కొట్టాడు. కీల‌క‌మైన స‌మ‌యంలో ఛేజింగ్ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన హార్దిక్ చెత్తషాట్ ఆడి పెవిలియ‌న్ కు చేరాడు. 6 బంతులు ఆడి 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అంత‌కుముందు చెన్నై బ్యాటింగ్ స‌మ‌యంలో చివ‌రి ఓవ‌ర్ లో భారీగా ప‌రుగులు ఇచ్చి ఓ ర‌కంగా హార్దిక్ ముంబై ఓట‌మికి కార‌ణంగా ఉన్నాడు. ఎందుకంటే చెన్నై చివ‌రి ఓవ‌ర్ లో బ్యాటింగ్ కు వ‌చ్చిన ఎంఎస్ ధోని కేవ‌లం 4 బంతుల్లోనే 20 ప‌రుగులు కొట్టాడు. హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదాడు. ధోని చేసిన ఆ 20 ప‌రుగుల తేడాతోనే ముంబై ఇండియ‌న్స్ ఓడిపోయింది.

ఈ చివ‌రి ఓవ‌ర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. ధోని హ్యాట్రిక్ సిక్సుల కొడుతుంటే హార్దిక్ పాండ్యాకు దిమ్మ‌దిరిగిపోయింది. ఒక వేళ హార్దిక్ పాండ్యా తన చివరి ఓవర్ లో ఇంతలా భారీగా పరుగులు ఇవ్వకపోయి వుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో మెరిశాడు. అయితే, మ‌రో ఎండ్ లో త‌న‌కు స‌హ‌కారం అందిస్తూ మ‌రో బ్యాట‌ర్ మంచి ఇన్నింగ్స్ ఆడివుంటే ముంబై గెలిచి వుండేది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోని చివ‌ర‌లో ఆడిన ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ చెన్నై గెలుపున‌కు కార‌ణ‌మైందని తెలిపాడు. 42 ఏండ్ల వ‌య‌స్సులోనూ ధోని దుమ్మురేపే షాట్స్ ఆడ‌టంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. మ‌హీ ఇన్నింగ్స్ మ్యాచ్‌లో నిర్ణయాత్మక వ్యత్యాసాన్ని చేసిందని అంగీకరించాడు.

Latest Videos

టీ20 క్రికెట్ లో ఒకే ఒక్క‌డు.. సిక్స‌ర్ల మోత.. రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు

ధోనీ హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో నాలుగు బంతుల్లో 20 పరుగులు చేయడంతో ముంబై ముందు 207 పరుగుల టార్గెట్ ను ఉంచింది చెన్నై. ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 186/6 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రోహిత్ శర్మ 61 బంతుల్లో సెంచ‌రీ కొట్టాడు. 19.2 ఓవర్లలో 186/4 చూపుతున్న స్కోర్‌కార్డ్ వ‌ద్ద ధోని క్రీజులోని వ‌చ్చి 4 బంతుల్లో 20 ప‌రుగులు సాధించాడు. మూడు భారీ సిక్స‌ర్ల‌తో 20 ఓవర్లలో స్కోర్‌బోర్డ్‌ను 206/4 చేర్చాడు. 20 ఓవ‌ర్ల‌లో ముంబై కొట్టిన ప‌రుగులు 186. అంటే ధోని కొట్టిన 20 ప‌రుగులు లేకుండే ఇరు జ‌ట్ల స్కోర్లు స‌మంగా ఉన్నాయి. రుతురాజ్ మాట్లాడుతూ.. "ఆ మూడు సిక్సర్లు సాధించి మాకు చాలా సహాయం చేసాడు, అది తేడాగా నిరూపించబడింది. ఈ రకమైన వేదిక కోసం మాకు ఆ 10-15 అదనపు పరుగులు అవసరం. మధ్యలో బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేసాడు. మేము స్పాట్‌లో ఉన్నామని నేను భావిస్తున్నాను. వారు కొన్ని గొప్ప షాట్‌లు చేసినప్పటికీ బంతితో మా ఎగ్జిక్యూషన్‌తో నేను పవర్‌ప్లేలో 6 ఓవర్లు 60 తీశాను" అని గైక్వాడ్ మ్యాచ్ తర్వాత ఇంటరాక్షన్‌లో చెప్పాడు.

అయ్యే రోహిత్ శ‌ర్మ‌.. క్యాచ్ ప‌ట్టబోతే ప్యాంట్ జారిపాయే.. ఏం చేసేది.. ! వీడియో

 

Dhoni aaye aur kya chaaye! 🙌🔥 pic.twitter.com/z0xenH4Aip

— JioCinema (@JioCinema)

 

6 బంతుల్లో 6 సిక్సర్లు... 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీతో విధ్వంసం.. వీడియో వైరల్ 

click me!