ఐపీఎల్‌లో సంచలనం: రోహిత్ రికార్డును బద్ధలు కొట్టిన కరన్

Siva Kodati |  
Published : Apr 02, 2019, 11:56 AM IST
ఐపీఎల్‌లో సంచలనం: రోహిత్ రికార్డును బద్ధలు కొట్టిన కరన్

సారాంశం

ఐపీఎల్‌ 2019లో రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ హ్యాట్రిక్ రికార్డును సామ్ కరన్ బద్ధలు కొట్టాడు

ఐపీఎల్‌ 2019లో రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ హ్యాట్రిక్ రికార్డును సామ్ కరన్ బద్ధలు కొట్టాడు. హ్యాట్రిక్‌లో రికార్డ్ ఏముంది అనుకుంటున్నారా..? ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తిసిన అత్యంత పిన్న వయస్కుడిగా రోహిత్ శర్మ పేరిట రికార్డు ఉండేది..

సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సామ్ కరన్ వరుస బంతుల్లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు హర్షల్ పటేల్, రబాడా, సందీప్ లమిచన్నేను ఔట్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తద్వారా 20 సంవత్సరాల 302 రోజుల పిన్న వయస్సులోనే కరన్ ఈ ఘనత సాధించగా... రోహిత్ 22 సంవత్సరాల 6 రోజుల వ్యవధిలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ ఈ ఘనత సాధించాడు. 2019 ఐపీఎల్ వేలంపాటలో కరన్‌ను పంజాబ్ యాజమాన్యం రూ.7.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !