యూవీ ఈజ్ బ్యాక్... ఒకే ఓవర్ లో నాలుగు సిక్సర్లు..!

Published : Mar 18, 2021, 09:33 AM IST
యూవీ ఈజ్ బ్యాక్... ఒకే ఓవర్ లో నాలుగు సిక్సర్లు..!

సారాంశం

రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరంగా ఉంటూ వచ్చాడు. కాగా.. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ లో మాత్రం యూవీ చెలరేగిపోయాడు.

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ చాలా కాలం తర్వాత తన సత్తా చాటారు. గతంలో.. టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన యూవీ.. ఆ తర్వాత డీలా పడిపోయాడు. రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరంగా ఉంటూ వచ్చాడు. కాగా.. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ లో మాత్రం యూవీ చెలరేగిపోయాడు.

వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో దిగ్గజ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్ సచిన్‌ టెండూల్కర్‌(42 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లతో 65) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా.. మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(20 బంతుల్లో 1ఫోర్‌, 6సిక్సర్లతో 49 నాటౌట్‌ ) చెలరేగాడు. దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది.

 

కాగా...  ఇప్పుడు యువరాజ్ సింగ్ కొట్టిన సిక్సర్ల గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యూవీ ఈజ్ బ్యాక్ అంటూ.. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో యువరాజ్.. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి యూవీ సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తాజాగా మరోసారి చెలరేగి తన సత్తా చాటాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !