బట్లర్ కూడా ఔట్.. ఇంగ్లాండ్ వంద చేసినా గొప్పే.. షమీ అరుదైన ఘనత

Published : Jul 12, 2022, 07:13 PM IST
బట్లర్ కూడా ఔట్.. ఇంగ్లాండ్ వంద  చేసినా గొప్పే.. షమీ అరుదైన ఘనత

సారాంశం

ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మరేపుతున్నారు. 15 ఓవర్లు కూడా ముగియకముందే ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. 

టీమిండియా పేసర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు గజగజ వణుకుతున్నారు.  ‘ది ఓవల్ లో ’ జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లీష్ జట్టు ప్రస్తుత  పరిస్థితుల్లో వంద పరుగులు చేసినా గొప్ప అనిపిస్తున్నది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లతో పాటు అడపాదడపా ఆడే బ్యాటర్లు కూడా పెవిలియన్ చేరారు.15 ఓవర్లకే ఇంగ్లాండ్ జట్టులోని ఏడుగురు ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ లో కూర్చొన్నారు.  ప్రస్తుతం ఇంగ్లాండ్.. 19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. బుమ్రా కు 4, షమీకి 3, ప్రసిధ్ కు ఒక వికెట్ దక్కింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షాకిచ్చాడు బుమ్రా.  ఆ ఓవర్లో అతడు వేసిన నాలుగో బంతికి జేసన్ రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా.. ఇంగ్లాండ్ కు మరో షాకిచ్చాడు.  వన్ డౌన్ లో వచ్చిన జో రూట్ (0)ను డకౌట్ చేశాడు.ఆ ఓవర్ చివరి బంతికి రూట్.. వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ (0) కూడా ఆడిన  తొలి బంతికే పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ వికెట్ షమీకి దక్కింది. ఇక బుమ్రావేసిన  ఐదో ఓవర్ మూడో బంతికి బెయిర్ స్టో పంత్ కు  క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ ఎన్నోఆశలు పెట్టుకున్న లివింగ్  స్టోన్ (0) ను కూడా బుమ్రా  ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్లీన్ బౌల్డ్  చేశాడు. 

వరుసగా వికెట్లు కోల్పోతున్నతరుణంలో ఇంగ్లాండ్ ను ఆదుకోవడానికి ప్రయత్నించిన మోయిన్ అలీ (14)ని ప్రసిధ్ కృష్ణ ఇన్నింగ్స్  14వ ఓవర్లో  ఔట్ చేశాడు. ప్రసిధ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చిన అలీ నిరాశగా వెనుదిరిగాడు.  

తర్వాత ఓవర్లో ఇంగ్లాండ్ కు మరో భారీ షాక్  తాకింది.  బాధ్యాతాయుతంగా ఆడుతున్న బట్లర్ (32 బంతుల్లో 30.. 6 ఫోర్లు) ను షమీ బోల్తా కొట్టించాడు. షమీ వేసిన ఇన్నింగ్స్15వ ఓవర్లో  మూడోబంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించిన బట్లర్..  బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్  కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా ఇంగ్లాండ్ ఆశలునేలకూలాయి. తనతర్వాత ఓవర్లో షమీ.. డేవిడ్ విల్లీ (1) ని బౌల్డ్  చేశాడు. 

 

షమీ ఘనత.. 

బట్లర్ వికెట్ వన్డేలలో షమీకి 150వ వికెట్. వన్డేలలో150 వికెట్లు తీసేందుకు  అతడికి 80 మ్యాచులే అవసరమయ్యాయి. గతంలో భారత్ తరఫ అజిత్ అగార్కర్.. 91 మ్యాచులలో 150 వికెట్లుపడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో చూస్తే ఈజాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ (77) ముందున్నాడు. ఆతర్వాత సక్లయిన్ ముస్తాక్ (పాకిస్తాన్ - 78 మ్యాచులు) షమీ కంటే ముందున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు