టచ్ చేసి చూడు.. బుమ్రా ఆన్ ఫైర్..! 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

Published : Jul 12, 2022, 06:25 PM IST
టచ్ చేసి చూడు.. బుమ్రా ఆన్ ఫైర్..! 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

సారాంశం

England vs India: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య జట్టు కష్టాల్లో చిక్కుకుంది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత పేస్ ద్వయం  జస్ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమీ ద్వయం చెలరేగుతున్నది. 

పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ ను గడగడలాడించిన టీమిండియా.. వన్డేలలో కూడా అదే ప్రదర్శనను  కొనసాగిస్తున్నది. ‘ది ఓవల్’ వేదికగా  జరుగుతున్న తొలి వన్డే లో భారత పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. నలుగురు టాపార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఇటీవలే ముగిసిన  టెస్టు సిరీస్  లలో సెంచరీల మీద సెంచరీలు చేసిన జో రూట్, బెయిర్ స్టో లతో పాట జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ లతోపాటు టీ20 స్పెషలిస్టు లివింగ్ స్టోన్ లు పెవిలియన్ చేరారు. 

టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బౌలర్లు శుభారంభం అందిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా బంతులను వదిలేయడం మినహా బ్యాట్ కు తాకిస్తే పెవిలియన్ కు చేరడమే అన్నంత ప్రమాదకరంగా అతడు బంతులు విసరుతున్నాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షాకిచ్చాడు బుమ్రా.  ఆ ఓవర్లో అతడు వేసిన నాలుగో బంతికి జేసన్ రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా.. ఇంగ్లాండ్ కు మరో షాకిచ్చాడు.  వన్ డౌన్ లో వచ్చిన జో రూట్ (0)ను డకౌట్ చేశాడు.ఆ ఓవర్ చివరి బంతికి రూట్.. వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. 

స్కోరుబోర్డుపై 6 పరుగులు చేరకుండానే రెండువికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ (0) కూడా ఆడిన  తొలి బంతికే పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ వికెట్ షమీకి దక్కింది. 7 పరుగులకు 3 వికెట్లు. 

ఆ క్రమంలో  బెయిర్  స్టో (7) తో కలిశాడు కెప్టెన్  బట్లర్. కానీ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. అతడువేసిన ఐదోఓవర్ మూడోబంతికి బెయిర్ స్టో పంత్ కు  క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ ఎన్నోఆశలు పెట్టుకున్న లివింగ్  స్టోన్ (0) ను కూడా బుమ్రా  ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్లీన్ బౌల్డ్  చేశాడు. 

 

ప్రస్తుతం ఇంగ్లాండ్ 10 ఓవర్లు ముగిసేరికి 5 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. బుమ్రా కు 4, షమీకి 1 వికెట్ దక్కింది. జోస్  బట్లర్ ( 14 నాటౌట్), మోయిన్ అలీ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు