ఐపీఎల్ ప్రిపరేషన్స్‌లో జోస్ బట్లర్‌కి కూతురి సాయం... ఎంత క్యూట్‌గా ఉందో...

Published : Apr 06, 2021, 01:50 PM IST
ఐపీఎల్ ప్రిపరేషన్స్‌లో జోస్ బట్లర్‌కి కూతురి సాయం... ఎంత క్యూట్‌గా ఉందో...

సారాంశం

మోర్గాన్ గాయపడడంతో టీమిండియాతో జరిగిన ఆఖరి రెండు వన్డేలకు సారథిగా వ్యవహారించిన జోస్ బట్లర్... హోటల్ గదిలో వర్కవుట్స్ చేస్తూ ఐపీఎల్ 2021 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్..

ఐపీఎల్ 2021 సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియాతో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న జోస్ బట్లర్, ఐపీఎల్ 2021 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తన హోటల్ రూమ్‌లో క్వారంటైన్ గడుపుతున్న జోస్ బట్లర్, వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాడు...

కష్టపడుతున్న జోస్ బట్లర్‌‌కి ఆయన కూతురు జార్జియా సాయం చేసింది... కూతురిని ఎత్తుకుని సిట్ అప్స్ చేసిన బట్లర్, ఆ తర్వాత రకరకాల ఎక్సర్‌సైజులు చేశాడు. తండ్రి చేసే వ్యాయామాలను శ్రద్ధగా గమనించిన జార్జియా, వాటిని అనుకరించేందుకు ప్రయత్నించింది.

ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్‌లో బట్లర్, బెన్ స్టోక్స్ కలిసి రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓపెనింగ్ చేయబోతున్నారని మోర్గాన్ బయటపెట్టిన విషయం తెలిసిందే..

2019 సీజన్‌లో 8 మ్యాచులు ఆడి 311 పరుగులు చేసిన జోస్ బట్లర్, 2020 సీజన్‌లో 13 మ్యాచుల్లో 328 పరుగులు చేశాడు. 2018 సీజన్‌లో 548 పరుగులతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి సారథిగా సంజూ శాంసన్ వ్యవహారించబోతున్న విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

ఇది కదా కిర్రాకెక్కించే వార్త.. బెంగళూరులోనే RCB మ్యాచ్‌లు.. ఇక గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే
T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్