ఐపీఎల్ 2021 సీజన్‌ని వదలని కరోనా.. మరో ముగ్గురికి కరోనా పాజిటివ్..

Published : Apr 06, 2021, 11:21 AM IST
ఐపీఎల్ 2021 సీజన్‌ని వదలని కరోనా.. మరో ముగ్గురికి కరోనా పాజిటివ్..

సారాంశం

వాంఖడే స్టేడియంలో మరో ఇద్దరు గ్రౌండ్‌మెన్, ఓ ప్లంబర్‌కి కరోనా.. భద్రత దృష్ట్యా స్టేడియం వదిలి బయటికి వెళ్లకూడదని సూచించిన ఐపీఎల్ యాజమాన్యం... వాంఖడే స్టేడియంలో 10 ఐపీఎల్ మ్యాచులు...

ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా భూతం వదలడం లేదు. ఇప్పటికే ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ మెన్‌గా పనిచేస్తున్న 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మరో ఇద్దరు గ్రౌండ్‌మెన్‌తో పాటు ఓ ప్లంబర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో వాంఖడే స్టేడియంలో మ్యాచుల నిర్వహణపై అనుమానాలు రేగుతున్నాయి. ఐపీఎల్ భద్రత దృష్ట్యా గ్రౌండ్‌మెన్ స్టేడియం వదిలి, ఇళ్లకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మ్యాచులు జరిగినన్ని రోజులు స్టేడియంలోనే ఉండాలని సూచించారు.

కరోనా బారిన పడిన కేకేఆర్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, ఆర్‌సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని క్వారంటైన్‌లో ఉన్నారు. ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంకా క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !