వరల్డ్‌కప్‌లో టీమిండియానే ఫేవరేట్.. కానీ: అజాహరుద్దీన్

Siva Kodati |  
Published : May 15, 2019, 10:24 AM IST
వరల్డ్‌కప్‌లో టీమిండియానే ఫేవరేట్.. కానీ: అజాహరుద్దీన్

సారాంశం

త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌‌ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌కప్‌ను గెలిచే సత్తా టీమిండియాకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. 

త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌‌ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌కప్‌ను గెలిచే సత్తా టీమిండియాకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. మనకు ప్రపంచకప్ గెలిచేందుకు మంచి అవకాశం వచ్చిందని.. మంచి జట్టుందని, అద్భుతమైన బౌలర్లు ఉన్నారని అభిప్రాయపడ్డాడు.

అయితే  అక్కడి వికెట్లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు  ఇబ్బంది కలుగుతుందని చాలా మంది అంటున్నారు.. అయితే మన బౌలర్లు కూడా ప్రత్యర్థిని అంతే ఇబ్బంది పెట్టగలరు కదా అని అజహార్ వ్యాఖ్యానించాడు.

టీమిండియాలో ప్రపంచస్థాయి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారని.. ఇలాంటి జట్టుతో వరల్డ్‌కప్ గెలవకపోతే తాను నిరాశపడతానని అజారుద్దీన్ తెలిపాడు. ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరేట్ అని.. తొలి ప్రాధాన్యం భారత్‌కే ఇస్తానని.. రెండు, మూడు స్థానాలను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు ఇస్తానన్నాడు.

ఎందుకంటే క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమన్నాడు. అప్పుడప్పుడు జట్టుకు కొన్ని ఓటములు సైతం ఎదురవుతాయని .. అయితే భారత్‌కు అలాంటివి ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్లు అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !