Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: స్మృతి మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్... సూపర్‌ నోవాస్ ముందు ఈజీ టార్గెట్...

Published : Nov 09, 2020, 09:07 PM IST
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: స్మృతి మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్... సూపర్‌ నోవాస్ ముందు ఈజీ టార్గెట్...

సారాంశం

68 పరుగులు చేసిన స్మృతి మంధాన... 5 వికెట్లు తీసిన రాధా యాదవ్... ఆఖరి ఓవర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన ట్రైయల్ బ్లేజర్స్...

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్, ట్రైయల్ బ్లేజర్స్‌కి బ్యాటింగ్ అప్పగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రైయల్ బ్లేజర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్ 20 పరుగులు చేయగా కెప్టెన్ స్మృతి మంధాన 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసింది.

ఒకానొక దశలో ఒకే వికెట్ కోల్పోయి 101 పరుగులు చేసిన ట్రైయల్ బ్లేజర్స్... భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే కీలక దశలో వరుస వికెట్లు తీసిన సూపర్ నోవాస్ బౌలర్లు, ప్రత్యర్థి బ్యాట్స్‌వుమన్‌ను భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది ట్రైయల్ బ్లేజర్స్.

దీప్తి శర్మ 9, రిచా ఘోష్ 10, ఎలిస్టోన్ 1, హర్లీన్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ ఐదు వికెట్లు తీయగా పూనమ్ యాదవ్, శశికళా సిరివర్థనే చెరో వికెట్ తీశారు.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !