జియో దెబ్బకు దిగివచ్చిన స్టార్... ఆ ఛానెల్‌లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు...

Published : Mar 06, 2023, 10:13 AM IST
జియో దెబ్బకు దిగివచ్చిన స్టార్... ఆ ఛానెల్‌లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు...

సారాంశం

మొబైల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్..  తెలుగు, తమిళ్ భాషల్లో HD ఛానెల్‌ని లాంఛ్ చేయనున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్... ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఫ్రీ డిష్ ఛానెల్‌లో మ్యాచులు.. 

వ్యాపారంలో ఎంత తక్కువ మంది కాంపీటీటర్లు ఉంటే అంత ఎక్కువ విజయం సాధించవచ్చు. మార్కెట్‌లోకి దిగిన తర్వాత పోటీదారులు లేకుండా చేసుకుంటే మోనోపలియే క్రియేట్ చేయవచ్చు. మొబైల్ టెలికాం రంగంలో జియో ఇదే చేసింది...

ఉచితంగా డేటా, కాల్స్ మాట్లాడుకోండి... అంటూ సంచలన ప్రకటనతో భారత మార్కెట్‌లోకి జియోని తీసుకొచ్చింది రిలయెన్స్ ఇండస్ట్రీస్. జియో దెబ్బకు అప్పటిదాకా మార్కెట్‌లో నిలదొక్కుకుపోయి, 1జీబీ డేటాకి వందల రూపాయలు వసూలు చేసిన మిగిలిన పోటీదారులంతా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. రోజూ ఏదో ఒక రీఛార్స్ చేసుకునే వినియోగదారులంతా ఒక్కసారి ‘ఉచితం’ అనేసరికి, మిగిలిన సిమ్‌లను పక్కనబడేశారు...

కోట్లు వసూలు చేసిన మార్కెట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితిని ఫేస్ చేశాయి ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు. జియో దెబ్బకు ఖజానాకి ఖాళీ కావడంతో ఎయిర్‌సెల్, డొకొమో వంటి కంపెనీలు మూతబడ్డాయి. పోటీని తట్టుకోలేక మార్కెట్‌లో మనుగడ సాధించుకునేందుకు ఐడియా, వోడాఫోన్ చేతులు కలిపి ఒకే ప్రొడక్ట్‌గా మారాయి.. 

జియో ధాటిని తట్టుకుని మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు మిగిలిన మొబైల్ టెలికాం కంపెనీలన్నీ రేట్లు తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ ఇదే స్ట్రాటెజీ వాడుతోంది జియో...

వేల కోట్లు పెట్టి ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది వయాకాం18. అయితే కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఐపీఎల్ మ్యాచులను చూసేందుకు అవకాశం కల్పించింది. అది కూడా HD, 4K వంటి అత్యాధునిక హంగులతో...

జియో సినిమా యాప్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఉచితంగా ప్రసారం అవుతున్నాయి. వచ్చే ఐపీఎల్ 2023 మ్యాచులు కూడా ఉచితంగా జియో కస్టమర్లకు అందించనుంది వయాకాం...

దీంతో డిజిటల్ మొబైల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ స్టార్ నెట్‌వర్క్, టెలివిజన్ ప్రసారంలో మార్పులు తీసుకు వస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ భాషల్లో కొత్తగా HD ఛానెల్స్‌ని లాంఛ్ చేయనుంది స్టార్ నెట్‌వర్క్...

అలాగే స్టార్ ఉత్సవ్ మూవీస్ అనే ఫ్రీ ఎయిర్ ఛానెల్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచులు ప్రసారం చేయనుంది డిస్నీ స్టార్. ఐపీఎల్ చరిత్రలో ఫ్రీ డిష్ ఛానెల్‌లో మ్యాచులు రావడం ఇదే తొలిసారి. అయితే అన్ని మ్యాచులు ఉచితంగా చూసేందుకు అవకాశం లేదు. కేవలం మొదటి 12 మ్యాచులు మాత్రమే ఈ ఛానెల్‌లో ఫ్రీగా వస్తాయి. ఆ తర్వాత మిగిలిన మ్యాచులు కావాలంటే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.. 

ఇప్పటికే ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోవడంతో డీస్నీ హాట్ స్టార్‌కి వేల కోట్ల నష్టం జరిగింది. ఐపీఎల్, ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రాదని తెలిసిన వెంటనే చాలామంది ఆ యాప్‌ని మొబైల్ నుంచి తొలగించారు. ఇలా ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 18 శాతం కస్టమర్లను కోల్పోయింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. అదీకాకుండా యాప్ ఉన్నా, దాన్ని రీఛార్జ్ చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?