మాస్క్ తో బుమ్రా.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్ భార్య

Published : Aug 20, 2020, 09:19 AM IST
మాస్క్ తో బుమ్రా.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్ భార్య

సారాంశం

కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తాను ముంబయి బయలు దేరాననే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. ఈ ఫోటోకి అభిమానుల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. 

టీమిండియా క్రికెటర్,  ముంబయి ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫోటోలతో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా.. బుమ్రా.. అహ్మదాబాద్ నుంచి ముంబయికి బయలుదేరాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు బుమ్రా. ఈ మేరకు తన ఫేస్ కి మాస్క్ కి పెట్టుకొని మరీ ఆ ఫోటో షేర్ చేశాడు.

కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తాను ముంబయి బయలు దేరాననే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. ఈ ఫోటోకి అభిమానుల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. కాగా.. దానికంటే ఎక్కువగా.. ఈ ఫోటోకి రోహిత్ శర్మ భార్య రితికా చేసిన కామెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

‘ హ్హహ్హ.. అయితే.. నీ మాస్క్ వెనక ఉన్న చిరునవ్వుతోనే మేము కలిసి పనిచేయబోతున్నాం’ అంటూ రితిక కామెంట్ చేసింది. కాగా.. రితిక చేసిన కామెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉండగా.. త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దుబాయి వేదికగా.. ఐపీఎల్ 13 సీజన్ కోసం ఆటగాళ్లు తలపడనున్నారు. కాగా.. దీనికోసం ఇప్పటికే.. అన్ని జట్ల క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించారు. ఇప్పుడు బుమ్రా.. కూడా.. ముంబయి వెళ్లి వాళ్లతో కలవనున్నాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : 15 ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. వచ్చి రాగానే సెంచరీతో రచ్చ!
Rohit Sharma : 27 ఫోర్లు సిక్సర్లతో రఫ్ఫాడించిన రోహత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ షో