
మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరి రంగన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. బెంగళూరులోని చామరాజపేట స్వగృహంలో ఆయన మరణించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెటర్ సంఘం తెలిపింది.
1948-1963 వరకు రంజీ క్రికెట్‌లో గోపాలస్వామి మైసూరుకు ప్రాతినిధ్యం వహించారు. కుడిచేతి మీడియం పేస్‌తో ఆయన బ్యాట్స్‌మెన్‌ను వణికించేవారు. మొదట్లో మైసూరుకు ఆడిన కస్తూరి రంగన్ 1962-63లో కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించారు.
ఆటగాడిగానే కాకుండా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా, బీసీసీఐ క్యూరేటర్‌గాను గోపాలస్వామి సేవలందించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీమిండియా మాజీ స్పిన్నర్, కెప్టెన్ అనిల్ కుంబ్లే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్రికెట్ అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని కుంబ్లే ట్వీట్ చేశారు. అనిల్ కుంబ్లేతో పాటు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యులు, కస్తూరి రంగన్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.