IPL 2021: జోష్ హజల్‌వుడ్ స్థానంలో మాజీ ముంబై ప్లేయర్‌... సీఎస్‌కే మాస్టర్ ప్లాన్...

Published : Apr 09, 2021, 02:45 PM IST
IPL 2021: జోష్ హజల్‌వుడ్ స్థానంలో మాజీ ముంబై ప్లేయర్‌... సీఎస్‌కే మాస్టర్ ప్లాన్...

సారాంశం

కరోనా భయంతో ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ జోష్ హజల్‌వుడ్... అతని స్థానంలో ఆసీస్ పేసర్ జాసన్ బెరెండార్ఫ్‌ను ఎంపిక చేసిన సీఎస్‌కే.... 2019లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన బెరెండార్ఫ్...

ఐపీఎల్ 2021 సీజన్, నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. అయితే కరోనా భయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ జోష్ హజల్‌వుడ్, ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ జాసన్ బెరెండార్ఫ్‌ను ఎంపిక చేసింది సీఎస్‌కే.

తొలుత ఆస్ట్రేలియా పేసర్ బిల్లీ స్టాంలేక్, ఇంగ్లాండ్ పేస్ రేసీ తోప్లేలను ఐపీఎల్ ఆడించాలని ప్రయత్నించినా, భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్టా ఈ ఇద్దరూ లీగ్ ఆడేందుకు ఇష్టపడలేదు. దీంతో బెరెండార్ఫ్‌ను ఎంపిక చేసింది సీఎస్‌కే.

2019లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆడిన బెరెండార్ఫ్, ఐదు మ్యాచులు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండు సీజన్లలోనూ అతను అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియా తరుపున 11 వన్డేలు,  టీ20 మ్యాచులు ఆడిన బెరెండార్ఫ్, మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు