James Anderson : సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ జేమ్స్ అండర్సన్. క్రికెట్ లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే మొదటి పేసర్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 3వ బౌలర్.
James Anderson : టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లెజెండరీ బౌలర్
James Anderson : క్రికెట్ లో అత్యంత విజయవంతమైన పేసర్. ఇంగ్లాండ్ కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన లెజెండరీ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన చివరి మ్యాచ్ లోనూ అద్భుతమైన బౌలింగ్ అటాక్ తో ఆకట్టుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం లార్డ్స్‌లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించి టెస్ట్ చరిత్రలో అత్యంత ఫలవంతమైన ఫాస్ట్ బౌలర్ ఉంటూ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 41 ఏళ్ల ఈ స్టార్ పేసర్ తన చివిరిదైన 188వ మ్యాచ్ లో 3-32 ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు.
క్రికెట్ చరిత్రలోనే మొదటి పేసర్ గా రికార్డులు..
undefined
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ జేమ్స్ అండర్సన్. క్రికెట్ లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే మొదటి పేసర్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు సాధించిన 3వ బౌలర్. 1946లో అలెక్ బెడ్సర్ తర్వాత స్వదేశంలో టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్. ఆండర్సన్ తన టెస్ట్ కెరీర్ కు వీడ్కోలు పలికే సమయంలో ఆస్ట్రేలియా లెగ్‌స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్ల కంటే నాలుగు వికెట్లు వెనుకబడి ముగించాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
మొత్తం 704 వికెట్లు..
వెస్టిండీస్‌తో శుక్రవారం ముగిసిన తొలి టెస్టు అండర్సన్‌కు చివరి టెస్టు మ్యాచ్. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లతో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాడు. 2003లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అండర్సన్ మొత్తం 21 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ టెస్టులో 40000 బంతులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చేరుకున్న మొదటి పేసర్‌గా, ఓవరాల్‌గా 4వ బౌలర్‌గా ఘనత సాధించాడు. 42 ఏళ్ల అండర్సన్ మరికొన్ని రోజులు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంది.