ఫీల్డ్ లోనే యూస‌ఫ్ ప‌ఠాన్ తో ఇర్ఫాన్ ప‌ఠాన్ బిగ్ ఫైట్.. ఎమోష‌న‌ల్ వీడియో

By Mahesh Rajamoni  |  First Published Jul 12, 2024, 11:04 PM IST

World Championship of Legends : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్న‌మెంట్  లో భాగంగా ఇండియా ఛాంపియన్స్-సౌతాఫ్రికా ఛాంపియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఇర్ఫాన్ ప‌ఠాన్ త‌న సోద‌రుడైన యూస‌ప్ ప‌ఠాన్ పై గ్రౌండ్ లోనే తీవ్ర కోపంతో ర‌గిలిపోయాడు.
 


World Championship of Legends : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్న‌మెంట్ లో షాకింగ్ రనౌట్ త‌ర్వాత టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన సోద‌రుడైన యూసుఫ్ ప‌ఠాన్ పై తీవ్ర కోపంతో ర‌గిలిపోయాడు. ఎమోష‌న‌ల్ అవుతూ.. ఉద్వేగభరిత నిరాశను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. నాటకీయ పరిణామాలలో ఇండియా ఛాంపియన్స్-సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఇర్ఫాన్ తన అన్నయ్య చేత నాన్-స్ట్రైకర్ ముగింపుతో తన వికెట్ ను త్యాగం చేశాడు.

ఈ దురదృష్టకర ఘ‌ట‌న త‌ర్వాత ఇర్ఫాన్ ప‌ఠాన్ త‌న కూల్ నెస్ ను కోల్పోయాడు. యూస‌ఫ్ ప‌ఠాన్ పై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. చూసుకుని ఆడొచ్చు క‌దా అంటూ అరిచాడు.  అయితే, ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఇద్ద‌రు సంతోషంగా క‌నిపించారు. ఫీల్డ్ లోని గొడ‌వ‌ను అప్పుడే మ‌ర్చిపోయారు. ఇర్ఫాన్ యూసుఫ్ నుదిటిపై ముద్దుపెట్టుకోవడం.. అతనిని కౌగిలించుకోవడం క్రికెట్ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Latest Videos

 

Kalesh Between Yusuf Pathan and Irfan Pathan for Run out.. pic.twitter.com/AVj7lP0I9e

— Satya Prakash (@_SatyaPrakash08)

 

🙈 all brothers can relate to this… pic.twitter.com/eQRu31Wmub

— Irfan Pathan (@IrfanPathan)

 

ఈ ఘ‌ట‌న ఇండియా ఛాంపియన్స్ టార్గెట్ ఛేద‌న‌లో 18వ ఓవర్‌లో ఇర్ఫాన్ డేల్ స్టెయిన్ వేసిన డెలివరీని డీప్ కవర్స్ వైపు కొట్టాడు. అయితే, మిస్ క‌మ్యూనికేషన్ కార‌ణంగా ర‌నౌట్ కు కార‌ణం అయింది. కాగా, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఇండియా ఛాంపియన్స్ తమ అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. 

'విరాట్ కోహ్లీని పాకిస్తాన్ ప్ర‌జ‌లు చాలా ప్రేమిస్తారు..'


 

click me!