నన్ను ఆల్‌రౌండర్‌ను చేయాలన్న ఐడియా చాపెల్‌ది కాదు.. సచిన్‌దే: ఇర్ఫాన్

Siva Kodati |  
Published : Jul 01, 2020, 02:45 PM IST
నన్ను ఆల్‌రౌండర్‌ను చేయాలన్న ఐడియా చాపెల్‌ది కాదు.. సచిన్‌దే: ఇర్ఫాన్

సారాంశం

టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై విరుచుకుపడ్డాడు మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. తనను బ్యాట్స్‌మెన్‌గా ప్రమోట్ చేసింది సచినే  తప్ప గ్రెగ్ చాపెల్ కాదని వెల్లడించాడు

టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై విరుచుకుపడ్డాడు మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. తనను బ్యాట్స్‌మెన్‌గా ప్రమోట్ చేసింది సచినే  తప్ప గ్రెగ్ చాపెల్ కాదని వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పఠాన్ మరోసారి గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

తాను నా రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాను. తనను ఆల్‌రౌండర్‌గా మూడో స్థానంలో పంపి గ్రెగ్‌చాపెల్ తన కెరియర్‌ను నాశనం చేశాడని చాలా మంది భావిస్తారు.

అయితే, నిజానికి తనను మూడో నెంబరులో పంపాలన్నది సచిన్ ఆలోచన అని ఇర్ఫాన్ అన్నాడు. తనను ఆ స్థానంలో పంపాలని ద్రవిడ్‌కు సచిన్ సూచించాడు. అతడికి సిక్సర్లు కొట్టే సత్తా వుంది.

కొత్త బంతిని ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలర్లను చక్కగా ఆడగలడు అని కూడా చెప్పాడని పఠాన్ గుర్తుచేసుకున్నాడు. కాగా, గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

చాపెల్ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్ సూచనలతో ఇర్ఫాన్ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. రాను రాను బౌలర్‌ కంటే బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు.

అయితే చాపెల్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత నుంచి పఠాన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది జనవరిలో క్రికెట్‌కు వీడ్కోలు  పలికాడు. టీమిండియా తరపున 29 టెస్టుల్లో 100 వికెట్లు, 120 వన్డేల్లో 173 వికెట్లు, 24 టీ 20 లలో 28 వికెట్లు పడగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !