కపిల్ దేవ్ ను వెనక్కినెట్టిన ఇషాంత్... అరుదైన రికార్డు నమోదు

By Arun Kumar PFirst Published Sep 2, 2019, 5:55 PM IST
Highlights

కింగ్ స్టన్ సబీనా పార్క్ వేదికన జరుగుతున్న సెకండ్ టెస్ట్ ద్వారా భారత పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పేరిట వున్న రికార్డును శర్మ బద్దలుగొట్టాడు. 

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ ద్వారా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట వున్న రికార్డును ఇషాంత్ బద్దలుగొట్టాడు. దీంతో ఉపఖండం బయట అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా ఇషాంత్ శర్మ అవతరించాడు. 

వెస్టిండిస్ తో జరిగిన మొదటి టెస్ట్ ఇషాంత్ అద్భుత  బౌలింగ్ స్పెల్ తో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ తో సరిపెట్టకున్నా. ఆ ఒక్క వికెటే అతన్ని కపిల్ దేవ్ రికార్డును బద్దలుగొట్టి అత్యుత్తమ బౌలర్ గా రికార్డు సాధించిపెట్టింది. 

ఇప్పటివరకు ఆసియా ఖండం బయట అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కపిల్ దేవ్. అతడు కేవలం 45 టెస్టుల్లోనే 155 వికెట్లను పడగొట్టాడు. కానీ ఇషాంత్ 156 వికెట్లను పడగొట్టి కపిల్ ను వెనక్కినెట్టాడు. ఇలా ఈ 31ఏళ్ల సీనియర్ పేసర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. 

సబీనా పార్క్ వేదికన జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇషాంత్ రెండో రోజు ఒక్కవికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ మూడో రోజు ఆరంభంలోనే  హమిల్టన్  వికెట్ పడగొట్టాడు. ఇలా హమిల్టన్ రూపంలో ఇషాంత్ ఖాతాలోకి 156వ వికెట్ చేరింది. 

ఉపఖండం బయట వేగంగా అత్యధిక వికెట్లు పడగొట్టిన టెస్ట్ బౌలర్లలో ఇషాంత్, కపిల్ దేవ్ లు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకున్నారు. ఆ  తర్వాత జహీర్ ఖాన్ 38 టెస్టుల్లో 147 వికెట్లతో థర్డ్ ప్లేస్, మహ్మద్ షమీ 28 టెస్టుల్లో 101 వికెట్లతో నాలుగో  స్థానంలో నిలిచారు.   

   
 

click me!