నాకు వికెట్లు, రికార్డులు దక్కకపోయినా సరే...అదొక్కటి చాలు: బుమ్రా

By Arun Kumar PFirst Published Sep 2, 2019, 5:00 PM IST
Highlights

టీమిండియా పేసర్ బుమ్రా భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో సాగుతున్న తన ప్రదర్శన గురించి అతడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  

వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా యంగ్ పేసర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా తన యార్కర్లతో విండీస్ ను బెంబేలెత్తిస్తున్నాడు. టెస్ట్ సీరిస్ లో అయితే అతడు మరింత చెలరేగిపోతున్నాడు. రెండో టెస్ట్ లో వెస్టిండిస్ టాప్ ఆర్డర్ ని హ్యాట్రిక్ ప్రదర్శనతో  కుప్పకూల్చాడు. ఇలా  కేవలం మొదటి ఇన్నింగ్స్  లోనే అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

అయితే రెండో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండిస్ 7 వికెట్ల నష్టానికి 87 పరుగుల వద్ద నిలిచింది. ఆ ఏడు వికెట్లలో ఆరు బుమ్రా తీసినవే. దీంతో మూడో రోజు బుమ్రా ఖాతాలోకి మరిన్ని వికెట్లు చేరతాయని అభిమానులు భావించారు. కానీ మిగతా మూడు వికెట్లలో ఒక్కటి కూడా బుమ్రా పడగొట్టలేకపోయాడు. 

మూడో  రోజు ఆట ముగిసిన అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడుతూ వికెట్లు తీయడమే ఆటగాడి అత్యుత్తమ బౌలింగ్ కాదన్నాడు. వికెట్లు పడగొట్టకున్నా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగితే ఆ బౌలర్ సక్సెస్ అయినట్లేనన్నాడు. అలా రెండో రోజు వికెట్లు పడగొట్టడం ద్వారా, మూడో రోజు టెయిలెండర్లను ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా తాను విజయం సాధించానని బుమ్రా పేర్కొన్నాడు. 

సీనియర్ బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలపై బుమ్రా ప్రశంసలు కురిపించాడు. వారిద్దరి అనుభవపూర్వక బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారని...తాను వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తున్నానని అన్నాడు. తానుు వికెట్లు, రికార్డుల కోసం ఆడటం లేదని...అవి నాకు దక్కకున్న అంతమంగా జట్టు గెలిస్తే చాలని అన్నాడు. అందుకోసమే మేమంతా సమిష్టిగా కష్టపడతామని బుమ్రా వెల్లడించాడు.  

  మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగుల వద్ద నిలిచింది. అయితే ఆ జట్టు ఇంకా 423 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. మరో రెండురోజుల ఆట మిగిలివున్నప్పటికి 8 వికెట్లతో ఈ  లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. కాబట్టి టీమిండియా విజయం ఖాయంగా  కనిపిస్తోంది. ఇలా కేవలం వెస్టిండిస్ జట్టుపై సీరిస్ విజయమే కాదు టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ భారత్ కు మంచి ఆరంభం లభించనుంది. 

click me!