IPL2022 KKR vs RR: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... నిలవాలంటే గెలిచి తీరాల్సిందే...

Published : May 02, 2022, 07:07 PM ISTUpdated : May 02, 2022, 07:19 PM IST
IPL2022 KKR vs RR:  టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... నిలవాలంటే గెలిచి తీరాల్సిందే...

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కేకేఆర్ టీమ్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. జోస్ బట్లర్ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది...

అయితే ఆరోన్ ఫించ్ 58, శ్రేయాస్ అయ్యర్ 85 పరుగులతో రాణించడంతో కేకేఆర్ 210 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. యజ్వేంద్ర చాహాల్ హ్యాట్రిక్ తీసి, ఐదు వికెట్లతో అదరగొట్టింది ఈ మ్యాచ్‌లోనే... ఆఖరి ఓవర్ దాకా సాగిన ఈ మ్యాచ్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. 


ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న కేకేఆర్, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే...

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో నితీశ్ రాణా నిలకడగా రాణిస్తున్నా, జట్టుకి విజయాలను అందించలేకపోతున్నారు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌తో పాటు ఆరోన్ ఫించ్,  సునీల్ నరైన్ వంటి ఫారిన్ ప్లేయర్లు స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు... 

గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కథను మార్చిన వెంకటేశ్ అయ్యర్, ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో కలిపి 16.50 యావరేజ్‌తో 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో అయ్యర్‌ని తుదిజట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేకేఆర్.

ఆండ్రే రస్సెల్ కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా... అదే ఫామ్‌ని కొనసాగించలేకపోతున్నాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కేకేఆర్, నేటి మ్యాచ్‌లో ఓడితే 2019 రికార్డును సమం చేసినట్టు అవుతుంది. 2019 సీజన్‌లో వరుసగా 6 మ్యాచుల్లో ఓడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

మరో వైపు పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో పరాజయం పాలైంది. 9 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మరో రెండు మ్యాచులు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది...

రాజస్థాన్ రాయల్స్ ఎక్కువగా జోస్ బట్లర్ పైనే ఆధారపడింది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కానీ, సంజూ శాంసన్ కానీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్ మెరుపులు కూడా కొన్ని మ్యాచులకే పరిమితమయ్యాయి... 

బౌలింగ్‌లో యజ్వేంద్ర చాహాల్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నారు.. పేపర్ మీద పటిష్టంగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య మ్యాచ్, కేకేఆర్‌కి మాత్రం చావో రేవోగా మారింది.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, కరణ్ నాయర్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ సేన్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, బాబా ఇంద్రజిత్, నితీశ్ రాణా, అంకుల్ రాయ్, ఆండ్రే రస్సెల్, రింకూ సింగ్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, శివమ్ మావి 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !