
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం హార్ధిక్ పాండ్యాకి ఇది రెండోసారి... ఐపీఎల్ 2022 సీజన్‌లో టాస్ గెలిచిన కెప్టెన్లు అందరూ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటుంటే, హార్ధిక్ పాండ్యా మాత్రం భిన్నంగా ఆలోచస్తూ విజయాలు అందుకుంటున్నాడు.
సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, లివింగ్‌స్టోన్ మెరుపు హాఫ్ సెంచరీ కారణంగా 189 పరుగుల భారీ స్కోరు చేయగా శుబ్‌మన్ గిల్ 96 పరుగులు చేసి రాణించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్.
ఇప్పటికే 9 మ్యాచుల్లో 8 మ్యాచులు గెలిచిన గుజరాత్ టైటాన్స్, ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం 9 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని 5 మ్యాచుల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది...
ఆరంభంలో మంచి విజయాలు అందుకుని అత్యంత పటిష్టంగా కనిపించిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసింది. ముఖ్యంగా లియామ్ లివింగ్‌స్టోన్ మ్యాజిక్‌పైనే ఎక్కవగా ఆధారపడుతున్న పంజాబ్ కింగ్స్, అనుకున్న రేంజ్‌లో విజయాలు అందుకోలేకపోతోంది...
శిఖర్ ధావన్ ఎప్పటిలాగే నిలకడగా రాణిస్తున్నా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నుంచి ఈ సీజన్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఒక్కటి కూడా రాలేదు. గత సీజన్‌లో కెప్టెన్‌గా చేసిన ఏకైక మ్యాచ్‌లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచిన మయాంక్ అగర్వాల్, ఈ సీజన్‌లో అలాంటి పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు...
బౌలింగ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్ ఆకట్టుకుంటున్నా రాహుల్ చాహార్ వికెట్లు తీస్తున్నా, కగిసో రబాడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు హార్ధిక్ పాండ్యా టీమ్, ఈ సీజన్‌లో పట్టిందల్లా బంగారంలా మారుతోంది. శుబ్‌మన్ గిల్ ఆరంభంలో ఆకట్టుకున్నా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు...
వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్... ఇలా ఒకరుపోతే ఒకరు... ప్రత్యర్థి టీమ్‌కి చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తూ, గుజరాత్ టైటాన్స్‌కి వరుస విజయాలు అందిస్తున్నారు... బౌలింగ్‌లో లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌తో పాటు గత మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ సాంగ్వాన్ కూడా అదరగొట్టాడు..
పంజాబ్ కింగ్స్ జట్టు: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, భనుక రాజపక్ష, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జెరీ జోసఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ