IPL2022 GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... తన పాత టీమ్‌పై హార్ధిక్ పాండ్యా...

Published : May 06, 2022, 07:05 PM ISTUpdated : May 06, 2022, 07:19 PM IST
IPL2022 GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... తన పాత టీమ్‌పై హార్ధిక్ పాండ్యా...

సారాంశం

IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... టేబుల్ టాపర్ వర్సెస్ టేబుల్ బ్యాక్ బెంచర్ మధ్య మ్యాచ్‌గా... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

2015 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసి, అటు నుంచి టీమిండియాలోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, తొలిసారిగా అదే జట్టుకి ప్రత్యర్థి కెప్టెన్‌గా బరిలో దిగబోతున్నాడు. తన పాత టీమ్‌పై హార్ధిక్ పాండ్యా ఎలా ఆడతాడు? తన పాత టీమ్ మేట్స్‌ని అవుట్ చేయడంలో ఎలాంటి ఎత్తులు ఉపయోగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

గుజరాత్ టైటాన్స్ 8 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉండగా, ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అయితే వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి విజయాన్ని రుచి చూసింది ముంబై ఇండియన్స్.. 

మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన తర్వాత గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరడంతో వారికి నేటి మ్యాచ్ ఓడినా పెద్దగా ప్రభావం ఉండదు. 

ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవకుండా ఉండాలంటే మిగిలిన ఐదు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. అందుకే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కి పరువు పోరాటంగా మారబోతున్నాయి...

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఓ సమస్యల సుడిగుండంలా కనిపిస్తుంటే, గుజరాత్ టైటాల్స్ తిరుగులేని టీమ్‌గా కనబడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్ బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతూ ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు ప్రధాన కారణంగా మారుతున్నారు..

స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.  ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా కేవలం 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. జస్ప్రిత్ బుమ్రా కమ్‌బ్యాక్ అటు ముంబై ఇండియన్స్‌కి మాత్రమే కాకుండా టీమిండియాకి కూడా చాలా అవసరం... అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ కూడా టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరబెడుతోంది.

గుజరాత్ టైటాన్స్‌లో సాయి సుదర్శన్ గత మ్యాచ్‌లో మంచి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లూకీ ఫర్గూసన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో నేటి మ్యాచ్ టేబుల్ టాపర్ వర్సెస్ టేబుల్ లోయర్‌గా మారింది...

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కిరన్ పోలార్డ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తీకేయ, జస్ప్రిత్ బుమ్రా, రిలే మెడరిత్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, లూకీ ఫర్గూసన్, అల్జెరీ జోసఫ్, మహ్మద్ షమీ

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది