IPL: 50 మ్యాచులు ముగిశాయి.. ఏ జట్టు పరిస్థితి ఏంటి..? ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరు.. ఇంటికి వెళ్లేదెవరు..?

Published : May 06, 2022, 03:15 PM ISTUpdated : May 06, 2022, 03:17 PM IST
IPL: 50 మ్యాచులు ముగిశాయి.. ఏ జట్టు పరిస్థితి ఏంటి..? ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరు.. ఇంటికి వెళ్లేదెవరు..?

సారాంశం

IPL 2022 Points Table: మార్చి 26న ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా అట్టహాసంగా మొదలైన  ఐపీఎల్.. గురువారంతో 50 మ్యాచులను పూర్తి చేసుకుంది.  ఈసీజన్ లో మొత్తం 74 మ్యాచులున్నాయి. 

రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ కలిగిన ఐపీఎల్ లో దాదాపు రెండో దశ ముగింపునకు చేరింది. మార్చి 26న వాంఖెడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలైన ఈ సీజన్..  గురవారం ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ముగిసిన మ్యాచ్ తో 50 మ్యాచులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ లో మిగిలున్నవి  24 మ్యాచులు.  అందులో నాలుగు ప్లేఆఫ్స్, ఫైనల్ పోను మిగిలుంది 20 మ్యాచులే.  ఈ నేపథ్యంలో ఏ జట్టు పరిస్థితి ఎలా ఉంది..? ప్లేఆఫ్స్ వెళ్లే జట్లేవి..? ఇప్పటికే ఆ అవకాశాలను కోల్పోయిన జట్లు ఏవి..?  ప్లేఆఫ్స్ కోసం  కొట్లాడుతున్న జట్లేవో చూద్దాం. 

లీగ్ దశ ముగిసేనాటికి టాప్-4లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ చేరతాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటు ప్లేఆఫ్ రేసులో ఉన్న జట్లు ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్. 

గుజరాత్ టైటాన్స్ : ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి 8 విజయాలతో ఉన్న హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్.. దాదాపు ప్లేఆఫ్ చేరినట్టే.  ఆ జట్టు తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచులలో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ పక్కా కానుంది.  

లక్నో సూపర్  జెయింట్స్ :  పది మ్యాచులు ఆడి ఏడు విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంలో ఉన్న లక్నో..  ఆఖరి నాలుగు మ్యాచులలో ఒక్కటి గెలిచినా చాలు. ఈ రెండు జట్లకు ప్లేఆఫ్ చేరకపోయే చింతే లేదు. 

రాజస్తాన్ రాయల్స్ : పది మ్యాచులాడిన రాజస్తాన్.. ఆరింట్లో నెగ్గి నాలుగు మ్యాచుల్లో ఓడింది.  టాప్-3లో ఉన్నా ఆ జట్టు ప్లేఆఫ్ కు చేరాలంటే తర్వాత జరుగబోయే నాలుగు మ్యాచులలో కనీసం రెండింట్లో భారీ విజయాలు సాధిస్తే ఇదే స్థానంలో ప్లేఆఫ్ చేరొచ్చు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 11 మ్యాచులాడిన  డుప్లెసిస్ సేన..  ఆరు విజయాలు, 5 ఓటములతో నాలుగో  స్థానంలో ఉంది. ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలవాలంటే తర్వాత ఆడబోయే మూడు మ్యాచుల్లో రెండింట్లో అయితే తప్పక నెగ్గాలి. 

 

ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ : పాయింట్ల పట్టికలో  5, 6, 7 స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. ప్లేఆఫ్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లకు ఇంకా నాలుగేసి మ్యాచులు మిగిలున్నాయి.  ఇప్పటికే 10 మ్యాచులాడి 5 విజయాలు, అన్నే పరాజయాలతో ఉన్న ఈ మూడు జట్లలో నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పంజాబ్ (మైనస్ లో ఉంది) తో పోలిస్తే ఢిల్లీ, హైదరాబాద్ మెరుగ్గా ఉన్నాయి. ప్లేఆఫ్ చేరాలంటే ఢిల్లీ, హైదరాబాద్ తమ తర్వాత నాలుగు మ్యాచులలో కనీసం మూడు నెగ్గాలి. అయితే నాలుగో స్థానంలో  ఆర్సీబీ పోటీ ఇస్తున్నందువల్ల  భారీ తేడాతో నెగ్గితే గనక ఈ జట్లకు ప్లేఆఫ్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి.  ఢిల్లీ, హైదరాబాద్  ల కాకుండా పంజాబ్ మ్యాచులు నెగ్గడంతో పాటు  భారీ తేడాతో నెగ్గితేనే ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది.  

కోల్కతా నైట్ రైడర్స్ : ఐపీఎల్ - 2022 లో రన్నరప్ హోదవాలో బరిలోకి దిగిన కేకేఆర్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. కేకేఆర్ కు ప్లేఆఫ్ ఆశలు లేకున్నా.. సాంకేతికంగా చూస్తే ఆ జట్టు తర్వాత ఆడబోయే మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలవాలి.   గెలవడం అంటే సాధారణ విజయాలు కాదు. భారీ తేడాతో నెగ్గాలి. అలా నెగ్గినా ప్లేఆఫ్ చేరే అవకాశం లేదు. మిగతా జట్ల జయాపజయాలు కేకేఆర్ మీద ప్రభావం చూపుతాయి. 

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ : చెన్నై తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచులు నెగ్గినా.. ముంబై తన చివరి ఐదు మ్యాచులు భారీ తేడాతో గెలిచినా  అవి ప్లేఆఫ్ చేరవు.  అధికారికంగా ఇప్పటికే  ఆ రెండు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక ఇప్పుడు తర్వాత ఆ జట్లు ఆడబోయే మ్యాచులన్నీ తర్వాత సీజన్  కు సన్నద్ధం కావడానికే తప్ప గెలిచినా, ఓడినా ఆ జట్లకు పోయేదేం లేదు. 

ఆరెంజ్ క్యాప్ :

50 మ్యాచులు ముగిసేనాటికి రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్.. 10 మ్యాచులలో 588 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ అతడిదే.  అతడి తర్వాత కెఎల్ రాహుల్ (451), శిఖర్ ధావన్ (369), డేవిడ్ వార్నర్ (356) ఉన్నారు. 

పర్పుల్ క్యాప్ :  

ఇది కూడా రాజస్తాన్ వద్దే ఉంది. ఆ జట్టు బౌలర్ యుజ్వేంద్ర చాహల్.. 10 మ్యాచులలో 19 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (18), కగిసొ రబాడా (17), టి.నటరాజన్ (17), హసరంగ (16) ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..
Hardik Pandya Girlfriend మహికా శర్మ ఒక్కనెల సంపాదన ఎంత..? ఆస్తులెన్నో తెలుసా?