IPL2022 CSK vs LSG: ఊతప్ప ఊరమాస్ బాదుడు, దంచికొట్టిన దూబే... లక్నో సూపర్ జెయింట్స్ ముందు...

Published : Mar 31, 2022, 09:26 PM IST
IPL2022 CSK vs LSG: ఊతప్ప ఊరమాస్ బాదుడు, దంచికొట్టిన దూబే... లక్నో సూపర్ జెయింట్స్ ముందు...

సారాంశం

27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రాబిన్ ఊతప్ప... 49 పరుగులు చేసి అవుటైన శివమ్ దూబే... లక్నో సూపర్ జెయింట్స్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో హై స్కోరింగ్ గేమ్ నమోదైంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ల కారణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ కింగ్స్‌పై తన ప్రతాపాన్ని మొత్తం చూపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది...

రాబిన్ ఊతప్ప దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో 2.2 ఓవర్లలోనే 28 పరుగులు చేసింది సీఎస్‌కే. ఇందులో 4 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసిన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఈసారి మొదటి రెండు మ్యాచుల్లో కలిసి 1 పరుగు మాత్రమే చేయగలగడం విశేషం. 

ఊతప్ప అవుటైనా రాబిన్ ఊతప్ప దూకుడు కొనసాగించాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప...  మెరుపు హాఫ్ సెంచరీతో పవర్ ప్లేలో ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది సీఎస్‌కే...

ఓవరాల్‌గా పవర్ ప్లేలో సీఎస్‌కేకి ఇది నాలుగో అత్యధిక స్కోరు. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన నాలుగో క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు సురేష్ రైనా 87, డ్వేన్ స్మిత్ 50 పరుగులు చేయగా, కేకేఆర్‌పై రైనా 47 పరుగులు చేశాడు.

పవర్ ప్లే ముగిసే సమయానికి 45 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, 185+ స్ట్రైయిక్ రేటుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఐపీఎల్ కెరీర్‌లో 194 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 27.94 సగటుతో 4800 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో 8వ స్థానంలో ఉన్నాడు ఊతప్ప...

22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన అంబటి రాయుడు, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

శివమ్ దూబే 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముగింట ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లూయిస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 9 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ రవీంద్ర జడేజా, ఆండ్రూ టై వేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

క్రీజులోకి వస్తూనే ఓ సిక్సర్, ఓ ఫోర్‌ కొట్టిన ఎమ్మెస్ ధోనీ 6 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా డివాన్ కాన్వే స్థానంలో జట్టులోకి వచ్చిన డ్వేన్ ప్రెటోరియస్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 


చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్‌, ఆండ్రూ టై, రవిభిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పిస్తున్న సమయంలో రవి భిష్ణోయ్ తన 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు వంటి కీలక వికెట్లు తీయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది