
ఐపీఎల్ 2022 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, తడబడుతూ మొదలెట్టింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, చెన్నై సూపర్ కింగ్స్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. బ్యాటింగ్ మొదలెట్టిన సీఎస్‌కేకి తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ ఇచ్చాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...
నో బాల్‌తో ఐపీఎల్ 2022 సీజన్‌ను ప్రారంభించిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్ మూడో బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను డకౌట్ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రుతురాజ్ గైక్వాడ్న... 20 ఇన్నింగ్స్‌ల తర్వాత డకౌట్ అయ్యాడు...
తొలి ఓవర్‌లో ఓ నో బాల్, రెండు వైడ్లతో 3 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చిన ఉమేశ్ యాదవ్.,.. బ్యాటర్‌కి పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. శివమ్ మావి ఓవర్‌లో ఫోర్, ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రాబిన్ ఊతప్ప... ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటి బౌండరీలు నమోదుచేసిన బ్యాటర్‌గా నిలిచాడు...
8 బంతుల్లో 3 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఐదో ఓవర్ తొలి బంతికే శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు ఉమేశ్ యాదవ్.
ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప స్టంపౌట్ అయ్యాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, షెల్డన్ జాక్సన్ మెరుపు వికెట్ కీపింగ్ కారణంగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్‌లో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన అంబటి రాయుడు రనౌట్ కావడంతో 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకుని పెవిలియన్ చేరాడు అంబటి రాయుడు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు రనౌట్ అయిన ప్లేయర్‌గా సురేష్ రైనాతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు అంబటి రాయుడు. శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్ 16 సార్లు రనౌట్ కాగా, రైనా, అంబటి రాయుడు 15 సార్లు రనౌట్ అయ్యారు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే...
6 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబే, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సీఎస్‌కే నయా కెప్టెన్ రవీంద్ర జడేజా రాణించడంపైనే చెన్నై సూపర్ కింగ్స్ ఎంత స్కోరు చేస్తుందనేది ఆధారపడి ఉంది.