IPL2022 CSK vs GT: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... గెలిచినా, ఓడినా పోయేదేమీలే!

By Chinthakindhi RamuFirst Published May 15, 2022, 3:05 PM IST
Highlights

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ... టాప్ 2లో గ్రూప్ స్టేజ్‌ని ముగించాలని చూస్తున్న గుజరాత్ టైటాన్స్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డీజే బ్రావో, మహీశ తీక్షణలకు జట్టులో చోటు దక్కలేదు... వారి స్థానంలో ఎన్ జగదీశన్, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, మత్తీశ పతిరాన జట్టులోకి వచ్చారు. ప్రశాంత్ సోలంకితో పాటు లంక యంగ్ స్పిన్నర్ మత్తీశ పతిరానకి ఇదే మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ కానుంది.

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 8 మ్యాచుల్లో ఓడి ముంబై ఇండియన్స్ తర్వాత ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా ఉంది. దీంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా మారింది...

Latest Videos

సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 73 పరుగులు, అంబటి రాయుడు 46 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

170 పరుగుల లక్ష్యఛేదనలో టాపార్డర్‌లో శుబ్‌మన్ గిల్, విజయ్ శంకర్ డకౌట్ అయినా సాహా, రాహుల్ తెవాటియా, అల్జెరీ జోషఫ్ విఫలమైనా డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఒంటిచేత్తో గుజరాత్‌ టైటాన్స్‌కి విజయాన్ని అందించాడు... 

నేటి మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్, తన పొజిషన్‌ని టాప్ 2లో మరింత పదిలం చేసుకుంటుంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి నేటి మ్యాచ్ పరువు సమస్యగా మారింది. నేటి మ్యాచ్‌లో ఓడితే, సీజన్ ముగిసే సమయానికి ఆఖరి పొజిషన్‌లో ముగించే ప్రమాదంలో పడుతుంది డిఫెండింగ్ ఛాంపియన్...

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇప్పటివరకూ 2020 సీజన్‌లో ఏడో స్థానంలో ముగించడమే అతి చెత్త ప్రదర్శనగా ఉంది. అయితే ఈసారి మాత్రం సీఎస్‌కేకి ఆ అవకాశాలు కూడా తక్కువే. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోయి, సీఎస్‌కే మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే టాప్ 5లో ముగించగలుగుతుంది..

గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జెరీ జోసఫ్, యష్ దయాల్, మహ్మద్ షమీ

 చెన్నైసూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ, శివమ్ దూబే, ఎన్ జగదీశన్, ఎమ్మెస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మత్తీశ పతిరాన, ముకేశ్ చౌదరి

click me!