
Andrew Symonds dies: ఆసీస్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) మృతిపై క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోవడంతో కేవలం ఆస్ట్రేలియాలోనే కాదు యావత్ ప్రపంచంలోని క్రికెట్ ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక సైమండ్స్ సహచర ఆటగాళ్ళు, ఆయనతో కలిసి ఆడిన విదేశీ ఆటగాళ్ళు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సైమండ్స్ కు నివాళి అర్పిస్తున్నారు.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సహచర ఆటగాడు సైమండ్స్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. సైమండ్స్ మరణవార్త తననెంతో బాధించిందని అన్నారు. తనకోసం మీ కోసం ఏదైనా చేసే అత్యంత నమ్మకమైన, సరదాగా, ప్రేమగా వుండే స్నేహితుడి గురించి ఆలోచిస్తే టక్కున సైమండ్స్ గుర్తుకువస్తాడు. అలాంటి గొప్ప స్నేహితున్ని కోల్పోవడం అత్యంత బాధాకరం అంటూ గిల్ క్రిస్ట్ బాధను వ్యక్తం చేసారు.
సైమండ్స్ అకాలమృతిపై మరో సహచర ఆటగాడు జాసన్ గిల్లెస్పీ విషాదం సంతాపం తెలిపారు. తెల్లవారుజామున మేల్కొంటూనే అతి విషాదకర వార్త వినాల్సి వచ్చింది. ఇది చాలా దారుణం. మేమంతా నిన్న చాలా మిస్ అవుతాం మిత్రమా... అంటూ గిల్లెస్పీ సంతాపం తెలిపారు.
మరో మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మెకెల్ బెవాన్ కూడా సైమండ్స్ కు సంతాపం తెలిపారు. సైమండ్స్ మృతివార్త మనసును కలచివేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ మరో హీరోను కోల్పోయింది. 2003లో వరల్డ్ కప్ టీమ్ లో తనతో కలిసి ఆడిన సైమండ్స్ అకాలమరణం బాధాకరం. ఎంతో టాలెంటెడ్ ఆటగాడు ఇక క్రికెట్ లోకానికి దూరమయ్యాడని బెవాన్ పేర్కొన్నారు.
మాజీ ఆసిస్ మాజీ ప్లేయర్ ప్లెమింగ్ కూడా సైమండ్స్ కు సంతాపం తెలిపాడు. ఇది చాలా వినాశకరమైన సంఘటన. రాయ్ చుట్టూ ఉండటం చాలా సరదాగా ఉండేది. సైమండ్స్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు.
పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. కారు యాక్సిడెంట్ లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. సైమండ్స్ తో తనకు మైదానంలోనే కాదు మైదానం బయటా మంచి సంబంధాలున్నాయన్నారు. అతడి మృతికి సంతాపం, కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని అక్తర్ పేర్కొన్నారు.
Andrew Symonds career..
1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసి.. 2012లో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచానికి గుడ్ బై చెప్పారు. సైమండ్స్ తన క్రికెట్ కెరీర్ లో మొత్తం 198 ODIల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే.. 2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు తన కెరీర్ లో 26 మ్యాచ్‌ల్లో 1462 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు.
అలాగే.. 14 టీ20లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 165 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు.