IPL2021 SRH vs CSK: నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... వృద్ధిమాన్ సాహా అవుట్...

Published : Sep 30, 2021, 08:36 PM IST
IPL2021 SRH vs CSK: నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... వృద్ధిమాన్ సాహా అవుట్...

సారాంశం

సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన గత మ్యాచ్ హీరోలు జాసన్ రాయ్, కేన్ విలియంసన్... 44 పరుగులు చేసి పెవిలియన్ చేరిన సాహా...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160+ టార్గెట్‌ను ఈజీగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, టేబుల్ టాపర్‌ సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది...


గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్, 7 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియంసన్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...  

10 బంతుల్లో 7 పరుగులు చేసిన ప్రియమ్ గార్గ్ కూడా బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఇప్పటికే 13 ఓవర్లు ముగిసిపోగా.. గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన ఇద్దరు ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో ఈ మ్యాచ్‌పైనా ఆశలు వదులుకున్నట్టే అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

PREV
click me!

Recommended Stories

IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో