T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు

Published : Oct 13, 2021, 02:58 PM ISTUpdated : Oct 13, 2021, 03:07 PM IST
T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు

సారాంశం

Team India New Jersey: త్వరలో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 18న భారత్ తన కప్ వేటను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలను బీసీసీఐ విడుదల చేసింది. 

విరాట్ కోహ్లి అండ్ కో కొత్త జెర్సీతో వచ్చేశారు.  త్వరలో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ కొత్త జెర్సీని విడుదల చేసింది. అక్టోబర్ 17 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ 18న వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నది. కొత్త జెర్సీల ప్రారంబోత్సవంలో  టీమ్ ఇండియా కెప్టెన్ Virat Kohli, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లు ఫోటోలకు ఫోజులిచ్చారు. 

Jersey ఎలా ఉందంటే..? 
టీ20 టోర్నీ కోసం ఈనెల 13న కొత్త జెర్సీని విడుదల చేయనున్నామని  వారం రోజుల  కిందటే BCCI ప్రకటించింది. అప్పట్నుంచి భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత నెలకొంది. New Jersey ఎలా ఉంటుందోనని అభిమానులు వేచి చూశారు. కాగా నేడు బీసీసీఐ ఆ ఫోటోలను విడుదల చేసింది. డార్క్ బ్లూ కలర్ షర్ట్స్ లో నెక్  దగ్గర ఆరెంజ్ కలర్ షేడింగ్ తో జెర్సీ అదిరిపోయింది. 1992 వరల్డ్ కప్ సందర్భంగా భారత జట్టు ధరించిన జెర్సీని పోలి ఉంటుందని దీనిని రూపొందించిన ఎంపీఎల్ (MPL Sports) ప్రతినిధులు ఇప్పటికే తెలపగా.. తాజా జెర్సీ అదే విధంగా తళుక్కుమంటున్నది. బిలియన్ చీర్స్ జెర్సీ అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో  ఫోటోలను పోస్ట్ చేసింది. 

 

ఈనెల 18 నుంచి India తన ప్రపంచకప్ వేటను మొదలుపెట్టబోతున్నది. అక్టోబర్ 18న ఇంగ్లండ్ తో, 20న ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. అనంతరం అసలు సిసలు సమరం మొదలవబోతుంది. 

ఇది కూడా చదవండి: మరో వ్యక్తితో టాయిలెట్ లో సెక్స్ చేస్తూ పట్టుబడిన భార్య.. కాండీస్ పనికి వార్నర్ షాక్

అక్టోబర్ 24న భారత్ తన చిరకాల ప్రత్యర్థి Pakistan తో తలపడబోతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు వేయి కండ్లతో వేచి చూస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో.. నవంబర్ 3న అఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లు ఆడనుంది. నవంబర్ 5న బీ గ్రూపులో తొలి స్థానంలో ఉన్న జట్టుతో.. 8 వ తేదీన ఎ గ్రూపులో రెండో  స్థానంలో నిలిచిన జట్టుతో పోటీ పడబోతుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు