IPL2021 CSK vs PBKS: 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే... పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి...

Published : Oct 07, 2021, 04:23 PM ISTUpdated : Oct 07, 2021, 04:36 PM IST
IPL2021 CSK vs PBKS: 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే... పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి...

సారాంశం

42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... రెండేసి వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అర్ష్‌దీప్ సంగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఆరు బంతులాడి డకౌట్ అయ్యాడు...

ఇది కూడా చదవండి: వచ్చే సీజన్‌లో ఆడతా, అయితే సీఎస్‌కేకి ఆడతానో లేదో... మరో ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

ఫస్టాఫ్‌లో బ్యాటుతో అదరగొట్టిన మొయిన్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 6 బంతుల్లో 2 పరుగులు, అంబటి రాయుడు 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు...

Must Read: ఎమ్మెస్ ధోనీ వారసుడొచ్చాడ్రోయ్... దేవ్‌దత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది సీఎస్‌కే.. ఫాఫ్ డుప్లిసిస్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిస్తే, రాజస్థాన్, కోల్‌కత్తా, ముంబై ఇండియన్స్ టీమ్ పర్ఫామెన్స్ ఆధారంగా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది...

PREV
click me!

Recommended Stories

Anushka Sharma : అరంగేట్రంలోనే అదరగొట్టింది.. ఎవరీ అనుష్క శర్మ?
Vaibhav Suryavanshi: 7 సిక్సర్లు, 9 ఫోర్లతో మాస్ ఇన్నింగ్స్ ! వరల్డ్ కప్ ముందు వైభవ్ ఊచకోత