IPL 2021 CSK vs PBKS: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. అసలు కింగ్స్ అయ్యేదెవరో..?

By team teluguFirst Published Oct 7, 2021, 3:15 PM IST
Highlights

IPL 2021 CSK vs PBKS: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యచ్ లో గెలిచి గత రెండు మ్యాచుల్లో ఎదురైన పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని  Dhoni సేన భావిస్తున్నది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచిన ఆ జట్టును రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా కొట్టించాయి.

ఐపీఎల్ లీగ్ దశకు ముగింపునకు చేరుకున్నది. అన్ని జట్లు ఇప్పటికే 13 మ్యాచులు ఆడేశాయి. లీగ్ దశ ముగియాలంటే  ప్రతి జట్టు ఇంకా ఒక్క మ్యాచ్ ఆడాలి. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కు ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని సీఎస్కే భావిస్తుండగా.. ఈ టోర్నీని విజయంతో ముగించాలని పంజాబ్ కోరుకుంటున్నది.  నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ KL Rahul.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యచ్ లో గెలిచి గత రెండు మ్యాచుల్లో ఎదురైన పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని  Dhoni సేన భావిస్తున్నది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచిన ఆ జట్టును రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా కొట్టించాయి. దీంతో టేబుల్ టాపర్లుగా ఉన్న CSK.. రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు Play offsనుంచి అధికారికంగా నిష్క్రమించినా.. నాలుగో స్థానం కోసం Punjab Super Kings ఇంకా  ఆశలతోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. 

ఇప్పటివరకు చెన్నై, పంజాబ్ జట్లు.. 25 మ్యాచుల్లో ముఖాముఖి తలపడగా ధోని సేన 16  సార్లు నెగ్గింది. పంజాబ్ తొమ్మది సార్లు విజయం సాధించింది. గత ఐదు మ్యాచుల్లో ధోని సేన నాలుగు విజయాలతో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ మ్యాచ్ లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని సీఎస్కే ఆశిస్తున్నది. 

మరోవైపు అనూహ్య ఓటముల కారణంగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్.. ఈ సీజన్ లో ఆడిన 13 మ్యాచ్ లలో 5 మాత్రమే నెగ్గింది. లీగ్ దశలో ఇదే  ఆ జట్టుకు చివరి మ్యాచ్. పంజాబ్ జట్టు పూరన్ స్థానంలో జోర్డాన్ ను తీసుకుంది. చెన్నై జట్టులో  మార్పులేమీ లేవు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ కంటే చెన్నై పటిష్టంగా కనిపిస్తున్నా.. చివరి రెండు మ్యాచులు ఓడటం ఆ జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. మరి సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య  అసలు కింగ్స్ అయ్యేదెవరో కాసేపట్లో తేలిపోనున్నది.


జట్లు
చెన్నై సూపర్ కింగ్స్:
ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హెజెల్వుడ్

పంజాబ్ సూపర్ కింగ్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, మార్క్రమ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మోయిసిస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రర్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

click me!