సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్, స్పెషల్ ఫ్లైట్స్ నడపనున్న యూఏఈ

By Sreeharsha GopaganiFirst Published Jul 24, 2020, 10:17 AM IST
Highlights

ఐపీఎల్‌13 యు.ఏ.ఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాంఛైజీలు తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ అధికారుల బృందం సైతం యుఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యుఏఈ ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థలు వెల్లడించాయి!. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020పై అధికారిక ప్రకటన, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (జీసీ)త్వరలో సమావేశం కానుంది. అయినా, అధికారిక ప్రకటన రాకముందే ఐపీఎల్‌ నిర్వహణ ఏర్పాట్లలో బీసీసీఐ నిమగమైంది. 

తొలుత సెప్టెంబర్ చివర్లో ఐపీఎల్ ప్రారంభమనుకున్నప్పటికీ... దానినిని దీపావళి సీజన్ దృష్ట్యా, భారత్ ఆస్ట్రేలియా పర్యటన దృష్ట్యా వారం రోజులపాటు ముందుకు జరిపి సెప్టెంబర్ 19వ తేదికి మార్చడం జరిగింది. సెప్టెంబర్ 19 న ప్రారంభమై, నవంబర్ 8 వరకు 51 రోజులపాటు ఈ మహా సంగ్రామం జరగనుంది. దాదాపుగా రెండు నెలలపాటు జరగనుండడంతో.... డబల్ హెడర్ లు తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్‌13 యు.ఏ.ఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాంఛైజీలు తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ అధికారుల బృందం సైతం యుఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యుఏఈ ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థలు వెల్లడించాయి!. 

'ఐపీఎల్‌ ప్రాంఛైజీలతో పాటు బీసీసీఐ లాజిస్టికల్‌, ఆపరేషన్స్‌ టీమ్స్‌ దుబాయి, అబుదాబి, షార్జాలకు వెళ్లాల్సి ఉంటుంది. నిర్వహణ విషయంలో ఐపీఎల్‌ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ అందుకు భిన్నంగా ఉండబోదు. 

యుఏఈ ఎయిర్‌లైన్స్‌ ఆగస్టు ఆఖర్లో ఆపరేషన్స్‌ మొదలు పెట్టకుంటే, ప్రత్యేక విమానాలు పరిశీలిస్తున్నాం' అని ఓ అధికారి వెల్లడించాడు. ఆగస్టు ఆఖర్లో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు, ఇతర భారత క్రికెటర్లు ఆగస్టు చివర్లో యుఏఈకి వెళ్లనున్నారు. 

అక్కడ క్వారంటైన్‌, శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు తమ ప్రయాణ ఏర్పాట్లు, హౌటల్‌ ఖర్చులు చూసుకుంటాయి. అయినా, బీసీసీఐ ఈ విషయంలో చొరవ తీసుకుని తక్కువ ఖర్చుతో సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్టు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో మ్యాచులు నిర్వహించాల్సి ఉన్నందున విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.... ప్రత్యేక విమానాలను నడపాల్సి రావొచ్చు అని సమాచారం. 

click me!