మంజ్రేకర్ కి మొండిచేయి: ఐపీఎల్ కామెంటేటర్ల ప్యానెల్ నుంచి అవుట్

By team teluguFirst Published Sep 4, 2020, 6:57 PM IST
Highlights

తాజాగా, ఐపీఎల్ కామెంటేటర్ల లిస్ట్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఇందులో సంజయ్ మంజ్రేకర్ కి మొండిచేయిని చూపించింది బీసీసీఐ.

ఐపీఎల్ ప్రారంభమవుతుండడంతో... క్రికెట్ అభిమానుల కళ్లన్నీ దానిమీదే ఉన్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ అహర్నిశలు శ్రమిస్తోంది. దుబాయ్ లో  చూసుకోవడం నుండి మొదలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం వరకు అన్నింటా ప్లానింగ్ తో దూసుకుపోతుంది. 

తాజాగా, ఐపీఎల్ కామెంటేటర్ల లిస్ట్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఇందులో సంజయ్ మంజ్రేకర్ కి మొండిచేయిని చూపించింది బీసీసీఐ. సునీల్ గవాస్కర్, అంజుమ్ చోప్రా, హర్ష భోగ్లే, దీప్ దాస్ గుప్త, రోహన్ గవాస్కర్, మురళి కార్తీక్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఉన్నారు. వీరంతా దుబాయ్ కి వెళ్లి అక్కడ గ్రౌండ్ నుండి కామెంటరీ చేయనున్నారు. 

తనకు కామెంటేటర్ల ప్యానెల్ లో చోటు కల్పించమని సంజయ్ మంజ్రేకర్ రెండు పర్యాయాలు బీసీసీఐ కి లేఖ రాసినప్పటికీ... అతనిని తిరిగి మాత్రం కామెంటేటర్ల ప్యానెల్ లోకి బీసీసీఐ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతనికి ఉన్న అనుభవం దృష్ట్యా తిరిగి వస్తాడని అందరూ అనుకున్నప్పటికీ.... అది జరగకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

రవీంద్ర జడేజాను పూర్తి పరిపక్వత లేని ఆటగాడిగా పేర్కొంటూ... ఆంగ్లంలో బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ అని అనడంతో అతడిని కామెంటేటర్ల ప్యానెల్ నుండి బీసీసీఐ తొలగించింది. అంతకుముందు హర్ష భోగ్లేను సైతం కించపరుస్తూ వ్యాఖ్యలు చేసాడు 

దీని తర్వాత నాలుగు నెలలకే మంజ్రేకర్ కామెంటరీ ప్యానెల్ లో స్థానం కోల్పోయాడు. ధర్మశాలలో భారత్, సౌతాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్ కి వెళ్లకపోవడంతో ఈ విషయం ప్రకటితమయింది. 

ఆ తరువాత దాన్ని ధృవీకరిస్తూ మంజ్రేకర్ సైతం కామెంటరీని తాను ఎప్పుడు గౌరవంగా భావించానని, కామెంటరీ కోసం తన  ఒడ్డానని, కానీ తనకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది తన బస్సుల ఇష్టం అని అన్నాడు మంజ్రేకర్. 

click me!