ఐపీఎల్ 2020: స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి..?, అందుకే దుబాయి..!

By Sreeharsha Gopagani  |  First Published Jul 25, 2020, 7:48 AM IST

మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 


క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ గురించి ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ తీపికబుర్లు చెబుతూనే ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా అనంతరం, ఐపీఎల్‌ యుఏఈలో పూర్తి స్థాయిలో జరుగనుందని వెల్లడించిన బ్రిజేశ్‌.. తాజాగా.... 51 రోజుల షెడ్యూల్‌తో ఐపీఎల్‌ 2020కి రంగం సిద్దమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. 

మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

Latest Videos

యూఏఈ ఎందుకంటే..?

ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. 

యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది. యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే, అభిమానులను సైతం పరిమిత సంఖ్యలో అనుమతించే అవకాశం లేకపోలేదు.

గత వారంలో యుఏఈ రోజువారీ నూతన కోవిడ్‌-19 కేసులు 300 కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క అంశంలో భారత్‌ కంటే యుఏఈ సురక్షితమనే భరోసా ఇస్తోంది. అదే భారత్‌లో రోజువారీ కేసులు 40000కు చేరువగా ఉన్నాయి. 

ఇదే సమయంలో యుఏఈ జులై 7 నుంచి పర్యాటకం కోసం దేశ సరిహద్దులను తెరిచింది. యుఏఈలోకి అడుగుపెట్టే వారికి కచ్చితమైన 15 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు లేవు. కోవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్టు చూపితే సరిపోతుంది. 

ఈ నిబంధనలు ప్రాంఛైజీలకు అనుకూలంగా ఉన్నాయి. క్రికెటర్ల క్యాంప్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు ఆఖర్లో యుఏఈకి బయల్దేరినా మూడు వారాలకు తగ్గకుండా ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం ఉంది. సెప్టెంబర్‌ తొలి వారంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు యుఏఈకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

click me!