ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్‌లో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు.. సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదే..

Published : Feb 17, 2023, 06:26 PM IST
ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్‌లో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు.. సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదే..

సారాంశం

IPL Schedule 2023: భాగ్యనగర ప్రజలకు  మరో నెల రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో  ఫుల్ మీల్స్ తో కూడిన  క్రికెట్ విందు భోజనం అందనుంది.  మూడేండ్ల గ్యాప్ తర్వాత ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. 

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. 2023 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన విషయం తెలిసిందే. గత మూడేండ్లు కరోనా, ఇతరత్రా కారణాలతో ఐపీఎల్ ను పరిమిత వేదికల్లోనే నిర్వహించారు. కానీ త్వరలో జరుగబోయే 16వ సీజన్ లో  మళ్లీ పాత విధానంలోనే నిర్వహించనున్నారు. ఒక్కో టీమ్ (మొత్తం 10)  14 మ్యాచ్ లు ఆడనున్న 2023 సీజన్ లో  ‘హోం అండ్ అవే ’ పద్ధతిని తిరిగి తీసుకొచ్చారు.  దీంతో  భాగ్యనగరంలో ఉన్న  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) లో మళ్లీ ఐపీఎల్  మ్యాచ్ లు జరుగనున్నాయి. 

గతంలో  ప్రతి సీజన్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)కు స్వంత స్టేడియంలో అభిమానులు అండగా నిలిచేవారు.  కానీ గడిచిన మూడేండ్లుగా  ఎస్ఆర్‌హెచ్  తమ స్వంత స్టేడియం ఉప్పల్ లో మ్యాచ్ ఆడలేదు.  త్వరలో ఆ లోటు తీరనుంది.   2019 సీజన్ లో భాగంగా  చివరిసారి ఇక్కడ  ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఆ తర్వాత మరో నెల రోజుల్లో అభిమానులతో ఉప్పల్ ఊగిపోనున్నది.  

తాజాగా ప్రకటించిన షెడ్యూల్  ప్రకారం.. ఎస్ఆర్‌హెచ్  తన స్వంత మైదానంలో ఏడు మ్యాచ్ లు ఆడనుంది.   ఏప్రిల్ 02న  ఎస్ఆర్‌హెచ్ తొలి మ్యాచ్ లో  రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది.  ఈ మ్యాచ్ ఉప్పల్ లోనే జరుగనుంది. పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూద్దాం. 

ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2023 షెడ్యూల్ : 

- ఏప్రిల్ 02 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ (హైదరాబాద్) 
- ఏప్రిల్ 07 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో) 
- ఏప్రిల్ 09 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్) 
- ఏప్రిల్ 14 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్  (కోల్కతా) 
- ఏప్రిల్ 18: ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ముంబై (హైదరాబాద్) 
- ఏప్రిల్ 21 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ చెన్నై (చెన్నై)
- ఏప్రిల్ 24 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ (హైదరాబాద్) 
- ఏప్రిల్ 29 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ (ఢిల్లీ) 
- మే 04 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కోల్కతా (హైదరాబాద్) 
- మే 07 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్ (జైపూర్) 
- మే 13 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో (హైదరాబాద్) 
- మే 15 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్) 
- మే 18 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్  బెంగళూరు (హైదరాబాద్) 
- మే 21 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్  ముంబై (ముంబై) 

 

చెన్నై, లక్నో, ముంబై, రాజస్తాన్, ఢిల్లీ, కోల్కతాలతో రెండేసి మ్యాచ్ లు ఆడే సన్ రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ లతో ఒక మ్యాచ్ మాత్రమే ఆడనుంది. 

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !