IPL: ఐపీఎల్-16 షెడ్యూల్ విడుదల.. సంప్రదాయానికి తెరదించిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఆ ఇద్దరి మధ్యే..

Published : Feb 17, 2023, 05:11 PM ISTUpdated : Feb 17, 2023, 06:35 PM IST
IPL: ఐపీఎల్-16 షెడ్యూల్ విడుదల..  సంప్రదాయానికి తెరదించిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఆ ఇద్దరి మధ్యే..

సారాంశం

IPL 2023 Schedule: భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను అమితంగా అలరిస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)   2023 సీజన్ కు వేళైంది.   మార్చి  31 నుంచి ఈ లీగ్   16వ సీజన్ మొదలుకానుంది.   

క్రికెట్ అభిమానుల ఆనందాన్ని  రెట్టింపు  చేయడానికి   మరో  పండుగ రానుంది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  2023వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.   బీసీసీఐ అధికారిక ప్రసారదారు  అయిన స్టార్ స్పోర్ట్స్  ఈ విషయాన్ని వెల్లడించింది.  పది టీమ్ లు  పోరాడబోయే ఈ  క్యాష్ రిచ్ లీగ్ మార్చి  31 న మొదలుకానుంది. మే 21న చివరి లీగ్ మ్యాచ్  జరుగుతుంది.  52 రోజుల  వరకూ జరుగబోయే ఈ టోర్నీలో  తొలి మ్యాచ్  ఎప్పటిలాగే గత సీజన్ విజేత  (గుజరాత్ టైటాన్స్) వర్సెస్ రన్నరప్ (రాజస్తాన్ రాయల్స్) కాకుండా సంప్రదాయాన్ని మార్చారు. 

రాబోయే 16వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను  నేడు ఐదు గంటలకు విడుదల చేయబోతున్నామంటూ  స్టార్  స్పోర్స్ తన ట్విటర్ ఖాతాలో  చేసిన ట్వీట్ తో  క్రికెట్ అభిమానుల్లో జోష్ మొదలైంది. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన  స్టార్ స్పోర్ట్స్.. ఐపీఎల్ -16 షెడ్యూల్ ను ప్రకటించింది.

ఈ లీగ్ లో  తొలి మ్యాచ్  మార్చి  31న  గుజరాత్ టైటాన్స్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ కు గుజరాత్ లోని అహ్మదాబాద్ (నరేంద్ర మోడీ స్టేడియం)  లో  జరుగనుంది.   ఈ లీగ్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉండనున్నాయి. ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. గతంలో కరోనాకు ముందు ఉన్న మాదిరిగానే ప్రతి జట్టు  ఏడు మ్యాచ్ లు హోంగ్రౌండ్ లో ఏడు తమ ప్రత్యర్థుల గ్రౌండ్ లో ఆడనున్నాయి. పది జట్లు  పాల్గొనబోయే ఈ టోర్నీలో  డబుల్ హెడర్స్  (శని, ఆదివారాలలో) ఉన్నప్పుడు మ్యాచ్ లు  మధ్యాహ్నం 3.30 గంటలకు  ప్రారంభమవుతాయి.   మిగిలిన రోజుల్లొ   రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి.  ప్రతీ జట్టూ 14 మ్యాచ్ లు ఆడనుంది.  ప్లే ఆఫ్స్, ఫైనల్ కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. 

 

రెండు గ్రూపులు 

గ్రూప్ - ఏ లో ముంబై, రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్, ఢిల్లీ, లక్నో సూపర్ కింగ్స్

గ్రూప్ - బీలో సీఎస్కే, పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్,  ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్   ఉన్నాయి.  

తొలి మూడు రోజుల్లోనే పది జట్లు.. 

ఈ లీగ్ లో  తొలి మూడు రోజుల్లోనే  పది జట్లు  పోటీలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్  గుజరాత్ - చెన్నై (అహ్మదాబాద్) మధ్య మార్చి 31న జరుగనుండగా  ఏప్రిల్ 1న  పంజాబ్ - కోల్కతా (మొహాలీ) మధ్య జరగాల్సి ఉంది.  అదే రోజు  రాత్రి  లక్నో - ఢిల్లీ (లక్నో) మ్యాచ్ జరుగుతుంది. ఇక ఏప్రిల్ రెండు న తొలి మ్యాచ్  సన్ రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ (హైదరాబాద్ లో) మ్యాచ్ జరుగనుండగా అదే రాత్రి  ఆర్సీబీ వర్సెస్ ముంబై (బెంగళూరు)  లో జరుగుతుంది.

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు