వాళ్లు అడుగెడితే కార్పొరేట్లకూ దిమ్మతిరగాల్సిందే.. మోదీ దోస్తును ఢీకొట్టి అహ్మదాబాద్ ను దక్కించుకున్న సీవీసీ

By team teluguFirst Published Oct 26, 2021, 12:55 PM IST
Highlights

CVC Capitals: ఐపీఎల్  తర్వాతి సీజన్ లో రెండు కొత్త జట్లు అలరించబోతున్నాయి.  అందులో ఒకటి లక్నో కాగా రెండోది అహ్మదాబాద్. లక్నో జట్టును ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గొయెంకా సారథ్యంలోని ఆర్పీఎస్జీ దక్కించుకోగా.. అహ్మదాబాద్ ను సీవీసీ పార్ట్నర్స్ గెలుచుకుంది.

అహ్మదాబాద్ (Ahmedabad) ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి హేమాహేమీలు తలపడ్దా.. పోటీలో ఏకంగా ప్రధాని మోదీ (PM MODI)కి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ (Adani)ని వెనక్కి నెట్టింది సీవీసీ పార్ట్నర్స్ (CVC Partners).  ఆ ఫ్రాంచైజీపై ఏకంగా రూ. 5,625 కోట్లకు బిడ్ వేసింది. ఖండాంతరాలు దాటిన ఐపీఎల్ (IPL) ఖ్యాతిని చూసి ముచ్చటపడిన యూరప్ సంస్థ సీవీసీ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్.. ఇది ఒక ప్రైవేట్ ఈక్విటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ. యూరప్ ఖండంలోని బెల్జియం, ఫ్రెంచ్, జర్మనీల ఆనుకుని ఉండే లగ్జంబర్గ్ హెడ్ క్వార్టర్స్ గా దీని కార్యకలాపాలు  సాగుతున్నాయి. 1981లో ఈ సంస్థను స్థాపించారు. సీవీసీ అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం..  ఇది పలువురు వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ. 34 మంది మేనేజింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి పదవి కాలం 15 ఏండ్లు. వీరిలో ముఖ్యంగా టహ అబ్దెల్ దయెమ్ (ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్), లిసా అబ్రుజ్జీస్ (ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్), సమి అల్లోని (డైరెక్టర్) గా వ్యవహరిస్తున్నారు.

ఐరోపా, ఆసియా  మార్కెట్లలో వాలీబాల్, రగ్బీ యూనియన్స్, ఫార్ములా వన్, మోటో జీపీ లో  ఈ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింద.ి అంతేగాక యూరప్ లో అతి పెద్ద ఫుట్బాల్ లీగ్ గా భావిస్తున్న లా లీగా లో కూడా వీళ్ల పెట్టుబడులున్నాయి.  లా లిగాలో వచ్చే 50 ఏండ్లకు గాను ఈ సంస్థ 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 

ఇది కూడా చదవండి: Sanjiv Goenka: ఎవరీ సంజీవ్ గోయెంకా.. ఆటలపై ఆయనకు ఎందుకంత ప్రేమ..? లక్నో టీమ్ ఓనర్ గురించి ఆసక్తికర విషయాలు

లగ్జంబర్గ్ ప్రధాన కేంద్రంగా ఉన్న సీవీసీకి ప్రపంచవ్యాప్తంగా 24 ఉపకార్యాలయాలున్నాయి. 2019 గణాంకాల ప్రకారం సీవీసీ ఆస్తుల విలువ 75 బిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని చూపెడుతున్నది. 

ఇక 1998 లో మోటో జీపీ బ్రాండ్ డోర్నాను కొనుగోలు చేసిన సీవీసీ.. 2006 లో 700 శాతం లాభానికి అమ్మేసింది. అయితే సీవీసీ సంస్థ ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్టాలని భావించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి ఆ సంస్థ ఆసక్తి చూపింది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ పలు కారణాల వల్ల డీల్ వర్కవుట్ కాలేదు. 

ఇక ఐపీఎల్ లో సీవీసీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచ క్రీడా యవనికపై ఐపీఎల్ మెరువనుంది. ఇదే విషయమై బీసీసీఐ (BCCI) కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘వారు (సీవీసీ) క తమ క్రీడా వ్యాపారాలతో ముందుకు సాగిన విధానం అద్భుతంగా ఉంది. ఇది ఐపీఎల్ కు లాభించేదే.  లీగ్ ఇప్పుడు ప్రపంచ వేదికపైకి చేరబోతుంది’ అని అన్నారు. 

click me!