
ఐసీసీ (ICC)టోర్నీలలో భారత్ (India) ను ఓడించలేరనే అపవాదును తొలగించుకుంటూ ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ (Pakistan) చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా లెజెండరీ కెప్టెన్లకు సైతం సాధ్యం కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాక్ కెప్టెన్ (Pakistan captain) బాబర్ ఆజమ్ (babar Azam).. ఈ గెలుపుతో అక్కడ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అతడి కీర్తిని పాక్ పత్రికలు ఆహా.. ఓహో అంటూ రాస్తున్నాయి. కానీ అతడు కనిపించే మంచోడు కాదని అంటున్నది అతడి మాజీ ప్రేయసి (Babar Azam Girlfriend). ఆజమ్ పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
మైదానంలో చూడటానికి ప్రశాంతంగా కనిపించే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. పైకి కనిపించేంత మంచివాడు కాదని ఆయన మాజీ ప్రేయసి గా చెప్పుకుంటున్న హమీజా ముఖ్తార్ (Hameeza Mukhtar) ఆరోపించింది. పాకిస్థాన్ వార్త పత్రిక 'డైలీ పాకిస్థాన్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. ఆజమ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆజమ్.. తనను లైంగికంగా వేధించేవాడని (Sexual Harassement), ఇద్దరం కలిసి చాలా కాలం పాటు కలిసున్నామని చెప్పుకొచ్చింది. తనను లైంగికంగా వాడుకుని.. కడుపు చేసి.. ఆపై అబార్షన్ చేయించాడని వాపోయింది.
హమీజా ముఖ్తార్ ఆరోపణలు ఆమె మాటల్లోనే.. ‘బాబర్ నన్ను డబ్బు కోసం లైంగికంగా వేధించేవాడు. మేమిద్దం 2011 లో కలిశాం. అప్పటికీ ఇద్దరం మైనర్లమే. అతడి కోసం నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. మా కుటుంబం మా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో లాహోర్ లో మేమిద్దరం చాలా కాలం పాటు సహజీవనం చేశాం. ఇంట్లోంచి వచ్చేప్పుడు నేను రెండు లక్షల రూపాయలు విలువ చేసే హారాన్ని తీసుకొచ్చాను. అంతేగాక నా రూ. 12 లక్షల విలువైన కారు కూడా అతడికోసం అమ్మేశాను’ అని తెలిపింది.
అంతేగాక.. ‘ఖురాన్ (Khuran) మీద ఒట్టేసి చెబుతున్నా. నేను చెప్పేదంత నిజం. బాబర్ నన్ను లైంగికంగా వేధించేవాడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మోసగించాడు. నాతో లైంగిక సుఖాలను అనుభవించి.. నన్ను గర్భవతిని కూడా చేశాడు. ఆ తర్వాత తనకు పిల్లలు అక్కర్లేదని అబార్షన్ చేయించాడు’ అని వాపోయింది.
బాబర్ ఆజమ్ మీద న్యాయపోరాటం చేస్తానని హమీజా చెబుతున్నది. ఇందుకు సంబంధించి ఆమె లాహోర్ కోర్టులో దావా కూడా వేసింది. ఈ కేసు పెండింగ్ లో ఉంది. అయితే ఈ కేసును వాపస్ తీసుకోవాలని ఆజమ్ ఫ్యామిలీ తన మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఆమె ఆరోపించింది. ఇందుకు గాను తనకు రూ. 20 లక్షలు కూడా ఇవ్వజూపారని తెలిపింది. ఆజమ్, తనకు మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించి తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, అవి కోర్టు ముందు ఉంచుతానని ఆమె వాపోయింది.