కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ 2020 ఉందా లేదా..? ఆరోజే తుది నిర్ణయం

By telugu news teamFirst Published Mar 12, 2020, 2:20 PM IST
Highlights

కరోనా ఎఫెక్ట్ తో ఏప్రిల్ 15వ తేదీ వరకు వీసాల విషయంలో భారత్ పలు కండిషన్స్ పెట్టింది. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు విదేశీ ఆటగాళ్లు ఎవరూ భారత్ లో అడుగుపెట్టడానికి లేదు. వాళ్లు లేకుండానే మ్యాచ్ నిర్వహిస్తారా లేదా తాత్కాలికంగా రద్దు చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా వైరస్ ప్రభావం ఐపీఎల్ 2020పై బాగానే పడింది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కారణంగా.. అసలు మ్యాచ్ లు జరుగుతాయా లేదా అనే అనుమానం కలుగుతోంది. నిజానికి మార్చి 29వ తేదీన ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా అన్నకున్న తేదీకే మ్యాచ్ ప్రారంభమైతే... ఈ మ్యాచుల్లో విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశం లేదు.

Also Read వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసొచ్చిన అభిమాని.. కరోనా పాజిటివ్ రావడంతో...

కరోనా ఎఫెక్ట్ తో ఏప్రిల్ 15వ తేదీ వరకు వీసాల విషయంలో భారత్ పలు కండిషన్స్ పెట్టింది. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు విదేశీ ఆటగాళ్లు ఎవరూ భారత్ లో అడుగుపెట్టడానికి లేదు. వాళ్లు లేకుండానే మ్యాచ్ నిర్వహిస్తారా లేదా తాత్కాలికంగా రద్దు చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ విషయాలన్నింటిపై మార్చి 14వ తేదీన క్లారిటీ రానుంది.  ఎందుకుంటే ఆ రోజు ఐపీఎల్ పాలక మండలి సభ్యులు,  బీసీసీఐ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో మ్యాచ్ జరగుతుందా లేదా.. రద్దు చేస్తారా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేవలం విదేశీ ఆటగాళ్లు లేకపోవడం మాత్రమే కాకుండా.. మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలపై చర్చించి అధికారులు మార్చి 14వ తేదీన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మార్చి 29న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఆ జట్టు క్రికెటర్లు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడేసి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. కేవలం మహారాష్ట్రలో 10 కరోనా కేసులు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఐపీఎల్ క్యాన్సిల్  చేయాలంటూ కోర్టులో పిల్స్ కూడా వేస్తుండటం గమనార్హం.

click me!