Sachin Tendulkar: ఐపీఎల్ 2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత సచిన్ టెండూల్కర్ పేరు హాట్ టాపిక్ గా మారింది.
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ 2024 సీజన్ కోసం కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ పదేళ్ల ప్రయాణం ముగిసింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు హార్దిక్ పాండ్యాకు ముంబై జట్టు పగ్గాలు అప్పగించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత ముంబయి జట్టుపై ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. క్రికెట్ విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆ జట్టు మెంటార్ సచిన్ టెండూల్కర్ కూడా జట్టును వీడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజంగానే సచిన్ ముంబై జట్టును వీడాడా? ఇందులో నిజమెంత?
ఇదివరకు ముంబై జట్టులో ఆటగాడిగా కొనసాగాడు సచిన్ టెండూల్కర్.. ప్రస్తుతం ఆ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ రాజీనామా తర్వాత సచిన్ టెండూల్కర్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే, ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ స్వయంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. అలాగే, ఈ విషయాన్ని ఐపీఎల్ టీమ్ కూడా ధృవీకరించలేదు. సోషల్ మీడియా ద్వారా కొందరు ఈ ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ తోనే ఉన్నారు. 2008 నుంచి 2011 ఐపీఎల్ సీజన్ వరకు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అతను ఐపీఎల్ 2012కు ముందు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాతి రెండు సీజన్లకు బ్యాట్స్ మన్ గా ఆడాడు. 2013లో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ తరువాత ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ ఆడిన తర్వాత టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ ఆ జట్టుతోనే అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.
హార్దిక్ కెప్టెన్సీలో ఐపీఎల్ ఆడనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందు హార్దిక్ ను గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేశారు. హార్దిక్ రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2022లో జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించగలిగాడు. అదే సమయంలో 2023 ఐపీఎల్లో గుజరాత్ జట్టు ఫైనల్ కు చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరఫ్ గా నిలిచింది.
Rohit Sharma: తొందరపడ్డ ముంబై.. ఇక అంతే..