IPL 2024 Auction LIVE updates: మొదటిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. దుబాయ్ లోని కోకకోలా ఎరీనాలో ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. వేలంలో మొదటి ప్లేయర్ రోవ్‌మాన్ పావెల్ ను భారీ ధరతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలంలో 333 మంది క్రికెటర్లు ఉన్నారు. వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లను వేలంలో వివిధ టీంలు దక్కించుకోనున్నాయి. 2023 డిసెంబర్ 19న దుబాయ్ లోని కోకాకోలా ఎరీనాలో వేలం జరుగుతోంది. 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు కాగా, వీరిలో ఇద్దరు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. మొత్తం క్యాప్డ్ ప్లేయర్లు 116, అన్క్యాప్డ్ ప్లేయర్లు 215, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం గరిష్టంగా 77 స్లాట్లు అందుబాటులో ఉండగా, విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లను కేటాయించారు.
వేలంలో మొదటి ప్లేయర్.. రోవ్‌మాన్ పావెల్ కోసం గట్టిపోటీ..
undefined
రోవ్‌మాన్ పావెల్ అన్ని జట్లు ఆసక్తి చూపాయి. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. చివరకు రూ.7.40 కోట్లు చెల్లించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర కోటి రూపాయలు. రోవ్‌మన్ పావెల్ ప్రపంచ క్రికెట్ లో దూకుడు బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. వెస్టిండీస్ ను అనేక మ్యాచ్ లలో గెలిపించాడు. జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే, IPL 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నప్పుడు అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది.
IPL 2023లో, రోవ్‌మన్ పావెల్ 3 మ్యాచ్‌ల్లో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని రాబోయే ఎడిషన్‌కు ముందే విడుదల చేసింది. రోవ్‌మన్ పావెల్ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా దూకుడుగా ఉన్న ఆటగాడు అని చాలాసార్లు నిరూపించాడు. ఈ సారి బిడ్ లో పెద్ద మొత్తంలో దక్కించుకున్నాడు.